అన్ని పాటలలో ప్రశిష్టమైనది
పక్షి పాట
నిశ్శబ్దంలో, కాని ముందుగా
నీలో నిశ్శబ్దం వుండాలి.
-వెండెల్ బెర్రీ
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)
మనం మానవాళి కోరికలకు అనుగుణంగా ప్రకృతిని మల్చుకుంటే, మనం మన పరిమితుల్ని
అద్దంగా మార్చుకునే ప్రమాదాన్ని సృష్టించుకుంటాం .అని జాన్ గ్రే అంటాడు. అవును పురోగతి
అంటూ మట్టికి శ్వాస లేకుండా చేస్తే మనలో అంతరించేది మనలోని యోగ నిశ్శబ్దం. అప్పుడు శ్వాస
ఉచ్చ్వాస,నిశ్వాస శబ్దంనుండి పుట్టే
కవిత్వం, ముందు తరాలకు మనం ఇచ్చే వీలునామా కాదు, మరణ వాంగ్మూలం.
కవిత్వ తత్వం కోల్పోనప్పుడు కవిత్వం కోల్పోవడంలో ఆశ్చర్యం
లేదు. చరిత్ర కవులకు పోషకులు అరుదనే
చెపుతుంది. కారణం కవిత్వం అనేది వినోదం కాదు అందుకే అప్పటికి ఎప్పటికి దానికి ధనం
కరువే. దాని ఇంధనం ప్రకృతిగా ఇమిడిపోయిన ని ‘శబ్ద’ గోష. ఆ ప్రకృతిని వెతుక్కుంటూ రాసుకుంటూ పోతున్నాం. శ్వాస ,
గుండెల చకుముకి రాళ్ళ నుండి పుట్టే నిప్పు ఇది. రోజురోజుకి పెరిగిపోతున్న పరాధీనత్వం నుండి బయట పడేసే యోగ ముద్ర..పర్యావరణ కవిత్వంలో బహుశా ఎక్కువ శాతం
వున్న అంశం పరాధీనత్వమే. సామాజిక
పరిణామంలో అత్యున్నత దశ నగరీకరణం అన్న సిద్ధాంతం అయితే ,ఇదే చివారఖరి దశ అని గుబులు
కుడా పుట్టించింది.
దీని పురోగతి
నలుదిశలా వ్యాపించలేదు. ఇలా ఎందుకనిపిస్తోంది అంటే చాల మారుమూల గ్రామాలు తిరిగాను
,రోడ్లు వుండవు ఏమీ వుండవు కాని అక్కడి సంస్కృతి మాత్రం ఇది పాత
వూరు, ఇది కొత్త వూరు అని ఒకే ప్రాంతాన్ని విభజించి చూడదు. ఇది కేవలం
నగరాలలోనే కనిపిస్తుంది. ‘ఓ పురానా షెహర్ ,యే నయా షెహర్’ ( అది పాత నగరం ఇది కొత్త నగరం). నదికి ఆవలి పాత, ఈవల కొత్త .
ఏ నగరంలో నైనా నదే కొత్త పాతల మధ్య సరిహద్దు రేఖ. మరి ఇది
అద్దంలోని మన పరిమితుల ప్రతిబింబమే కదా.
ఇప్పుడు ప్రపంచం విస్తారమైన నియంత్రణలేని ప్రయోగశాల, ఇందులో అసంఖ్యాక
ప్రయోగాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఆ ప్రయోగాల ప్రభావం మనలోని ప్రశాంతమైన
నిశబ్ద గీతాన్ని రణ గొణ ధ్వని గా మార్చేస్తోంది. ఈ రణ గొణ ధ్వనిలో
మనతో బాటు మనలాగే అపార్ట్ మెంటులో మిగిలి పోయిన పావురాళ్ళు కొన్ని ‘గుత్రున్ ,గుత్రున్’ అని శబ్దం చేస్తు వుంటాయి. వాటి
పాటల్లా ‘వీ ఆర్ ఇన్ కస్టడి’. ప్రకృతినుండి పరాధీనం అయిన తర్వాత
ప్రతి పక్షి పాటలోని అర్ధం ఇదే. అందుకే
పశ్చాతాపంతో వాటికిన్ని గింజలు జల్లుతూ వుంటాం, ఏమి సాధించాం ఏమి కోల్పోయామని అన్న
నిశబ్దపు ఆలోచనలో. దానిని -ఎల్లెన్ గిన్స్ బర్గ్ ఇలా
వ్యక్తపరిచారు...
చాల ఎక్కువ ,
చాల తక్కువ
-ఎల్లెన్ గిన్స్ బర్గ్
మరి ఎక్కువ పరిశ్రమలు
చాల తినడం
చాల ఎక్కువ బియర్
చాల ఎక్కువ సిగరెట్లు
చాల ఎక్కువ తత్వం
చాల ఎక్కువ ఆలోచనా ధోరణులు
సరిపోని గదులు
తక్కువ చెట్లు
మరి ఎక్కువ పోలీసులు
మితిమీరిన కంప్యూటర్లు
మరి ఎక్కువ హై ఫై
మరి ఎక్కువ పంది మాంసం
మరి ఎక్కువ కాఫీ
మరి ఎక్కువ పొగ
మసిబారిన పై కప్పులు
మరి ఎక్కువ అతివినయం
చాల బానికడుపులు
చాల ఎక్కువ వ్యాపార దుస్తులు
చాల ఎక్కువ కాగితం పైన పనులు
చాల ఎక్కువ పత్రికలు
ఎక్కువ మంది అలసిన కార్మికులు
రైళ్లల్లో
ఎక్కువ వృద్దుల
హత్యలు
ఎక్కువ మంది వెర్రి విద్యార్ధులు
చాలని తోటలు
చాలని యాపిల్ పండ్లు
విపరీతమైన డబ్బు
ఎక్కువ మంది పేదలు
ఓటు హక్కులేని శరణార్ధులు
ఎక్కువ లోహాలు
ఎక్కువ కొవ్వు
మరి ఎక్కువ హాస్యం
అతి తక్కువ ధ్యానం
( అనుసృజన జి. సత్య శ్రీనివాస్)
నగరీకరణాన్ని, అభివృద్ధి ,అభివృద్ధి ప్రకృతిని అతి క్లుప్తత
తో చెప్పడం కష్టం ,ఆ శైలి ఈ కవితలో వుంది.విస్తారమైన మైదానాన్ని ఒక్క చూపులో
పొదిగినట్టు. ఇదంతా స్లో పాయిజన్ ప్రాసెస్. అందులోని చేదు నిజాల్ని మింగడం క్రమేణా
అలవాటైపోతోంది. నగరీకరణం అనివార్యం అయినప్పుడు మనః చెరశాలనుండి వచ్చే వాక్యం హరిత
హారానికి మట్టి రేణువవుతే చాలు.