మట్టిగూడు
ముగింపులో తిరిగి కలుద్దాం
అని సుమారు మూడు సంవత్సరాలైంది. ఈ
మూడు సంవత్సరాల్లో తిరిగి కలిసినప్పుడు ఏం చెప్పాలి అన్న ప్రశ్న
వెంటాడుతూనే వుంది,సమాధానం అంటూ స్పష్టంగా
ఇంకా స్ప్రుజించలేదు కానీ ఒక నమ్మకం
మాత్రం వుంది ఈ కొనసాగింపు
దారిలో చాలా చెప్పుకోవచ్చని,
ఎందుకంటే యాన్ద్రి వైట్ అన్నట్టు ,
మనిషికి ఒడ్డుని చూసే చూపుని ఒదులుకునే ధైర్యం
లేకపోతె కొత్త సముద్రాల్ని చూడలేడంట.
అవును , ఒడ్డుని చూసే చూపుని వదులుకునే ప్రయత్నం
చేశాను, మట్టిగూడులో పర్యావరణాన్ని
ప్రస్తావిస్తూ ,వివిధ పర్యావరణాల్ని చెప్తూ
అందులోని పర్యావరణ కవిత్వాల్ని పొందుపర్చాను. ఇక ఇప్పడు పర్యావరణం గురించి ప్రస్తావనలో ఒక అడుగు ముందుకు వేసి నడుద్దాం
అని దీనికి ముందుగా నీటి గింజ అన్న శీర్షిక
పెట్టాను ఎందుకంటే సూర్యకాంతి చినుకు నుండి ప్రసరితమైనప్పుడు
ఆకాశంలో ఏడురంగుల అర్దచక్రం లా ఏర్పడుతుంది. అలానే పర్యావరణాన్ని అర్ధంచేసుకోవాలంటే ప్రకృతి అర్ధం అవ్వాలి .ఇది అర్ధం అవ్వాలంటే
దానితో ముడిపడిన సిద్ధాంతాలు తెలియాలి ,ఇది ఇప్పడు సాహిత్యం మాధ్యమంలో ముఖ్యంగా ఇక్కడ కవిత్వం దృష్ట్యా కనుగొనాలి. ఇలా
పర్యావరణానికి సమంధించిన పలు దృక్పధాలు అందులోని కవిత్వతత్వాలు పంచుకోవాలని, ఇలా ప్రకృతిని కవిత్వ కలయిక ని
అర్ధం చేస్కొడానికి కవిత్వికృతిని అల్లుదామని....
ప్రకృతిని మర్చిన దృక్పధం
ప్రపంచవ్యాప్తంగా
ఉన్న రెండు వైరుధ్య దృక్పధాలు ప్రకృతిని
కేవలం ఒక ముడి సరుకుగా చూశాయి, 20వ
శతాబ్దంలో సాహ్యిత్యానికి సంబంధించిన
అంశాలు , ప్రచురణలు గమనిస్తే జాతి, వర్గం,
జెండర్ విసృఖులంగా పరివ్యాప్తి చెందాయి ,ఇక్కడ ప్రకృతి ,భూమి అన్న విషయాని
మర్చి దానిని ఒక ముడి సరుకుగా చూశాయి. మన చుట్టూ వున్న పర్యావరణం
విధ్వశం అయినాక గానీ తట్ట లేదు మనం అధారపడి వున్నది ప్రకృతి పైన అని, అప్పడినుండి
అది ఎవడి ఆధిపత్యం లో వుంది అని, అప్పటికే ఆలస్యం అయ్యింది ,అందుకే ఇప్పటికీ
క్లైమేట్ చేంజ్ చర్చలు చర్చలు గా మిగుల్త్తున్నాయి
తప్ప కార్యాచరణ లోకి రాదు. క్లైమేట్
చేంజ్ అంటే బాహ్య పర్యావరణాన్ని మార్చడం వల్ల అవ్వదు మన అంతర్గత పర్యావరణాన్ని మార్చుకోవడం , ఇది మనిషి ప్రకృతిలో ఒక ఆం ఆద్మీ అనుకునపుడే వస్తుంది
తప్ప ఆడ్ అండ్ ఈవెన్ డేస్ ఏర్పాటు చేయడం
వల్ల కాదు.
“ఒక రోజు భూమి చచ్చి పోతుంది,తన ప్రాణం కోసం ప్రాదేయ పడుతుంది,
రక్తఃపు కన్నీరు తో విలపిస్తుంది, నీవు అలోచిస్తావు ఆమెని రక్షించాలా లేక ఆమెని చావనివ్వలా వద్దా అని, ఇక ఆమె మరణించిన తర్వాత నువ్వు
మరణిస్తావు” జాన్ హలో హార్న్ ,ఒగ్లాల లకోట(రెడ్
ఇండియన్)
ఒక ఆడ్ డే ఏర్పడిన తర్వాత ఈవెన్ డే
తిరిగి రాదు. పర్యారణ విద్వంశం తర్వాత, విద్వంశం ఆపడానికి వెల్లువెత్తిన ఉద్యమాల నుండి పర్యావరణ కవిత్వం వచ్చింది.
పర్యావరణ
కవిత్వం అన్నది మెటాఫర్ ఆఫ్ ప్రొటెస్ట్
సాహిత్యం. పర్యావరణ
కవిత్వానికి నేరేటివ్ కాపిటల్ లక్షణం వుంటుంది. పర్యావరణ కవిత్వం లో మరో విశిష్ట లక్షణం
ప్రకృతి ప్రతీకల్ని ఒక ఉన్మాద రూపంలో
విశదం చేయదు .దానికుండే గుణాన్ని సూటి గానే చెపుతుంది. అప్పుడు ప్రకృతి ఒక
ఉన్మాదంగా కాకుండా సామాజిక,రాజకీయ వ్యవస్ధ ఒక ఉన్మాదంగా ప్రస్ఫుటం అవుతుంది.
పర్యావరణ కవిత్వంలో సోషియాలజి
ఆఫ్ పోయట్రి ని కాప్చర్ చేయెచ్చు. దీని వల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక
ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది. సామాజిక అస్తిత్వ పోరాటాలలో ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ
ఇప్పుడు కవిత్వానికి కొత్త రూపాన్ని ఆవిష్కరించేందుకు జరుగుతోంది.
కవిత్వం,సాహిత్యం ద్వారా అస్తిత్వ పోరాటాల్ని వెలికి తీయడం. ఇది చేపట్టడానికి
కవిత్వం, సాహిత్యంతో బాటు సోషల్ ఎకాలజిని అర్ధం చేసుకోవాలి.
గతంలో పర్యావరణం గురించి
రాసినప్పటికీ, ఈమధ్యనే ఇది కొత్త ఒరవడిగా ,నూతన పద సృష్టి గా ఎదుగుతోంది. జేమ్స్
ఎన్గల్ హార్ట్ చెప్పిన వివరణ లోని కీలక అంశం , ఇతర సిద్ధాంతాల్లాగానే (మార్క్స్,
స్త్రీవాదం, వగైరా ) సామాజిక బాధ్యతతో
కూడిన ప్రక్రియ.
మనమిప్పుడు సామాజిక,సాంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల్లో
ఏర్పడుతున్న పలు మార్పుల స్ధితిలో
వున్నామన్నదాన్ని కాదనలేము. సామాజిక తీరుతెన్నులు,వాటి నూతన ఒరవడులు ఒకదానితో ఒకటి ఏవిధంగా సాగుతున్నాయన్నది కేవలం
విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితం కాలేదు.
మన నరనరాల్లోకి మనకి తెలియకుండానే ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా
జీవించడమే మనం అనుభవిస్తున్న ఘర్షణ.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే
మనం చేస్తున్న తప్పు. రోజు రోజుకి సిద్ధాంతాలు మారుతున్నాయి ,వీట్ని తోలిదశల్లోనే పట్టుకుని వెంటాడితే తప్ప వాటి గతితాత్విక మార్గాన్ని
మార్చలేం.
పర్యావరణ కవిత్వం అన్నది ఇప్పుడు చూస్తే ఇది ప్రకృతి కవిత్వం కాదు , ప్రకృతి విధంసాన్ని వ్యతిరేకించే
కవిత్వం. మరి ఈ ఈ విధ్వంశం ఎవరు ఎలా, ఏ రూపంలో చేస్తున్నారు అంటే ఇది కేవలం కనిపించే బాహ్య రూపంలో కాదు , ఒక
రాజకీయ రూపంలో . ఇది పారిశ్రామికీకరణ వల్ల
విస్తృతంగా ప్రభలింది. అంటే పారిశ్రామికీకరణ అంటే కేవలం పరిశ్రమల నిర్మాణం నగరికరణమా! పర్యావరణ
విశ్లేఖకులు దృష్టిలో కాదు.
ఎందుకంటే ఇది అనాదిగా ప్రకృతిపై మనిషి
చేసే ఆధిపత్య దృక్కోణం ఇది ఆంత్రపోసెంట్రిక్ దృక్పదం.
ప్రకృతి ,వికృతి
ఇక సాహిత్యం , పర్యావరణం అన్నది సాహిత్య అధ్యయనాలోన్ని
ఒక శాఖనా ! లేక పర్యావరణ
శాస్త్రంలో ప్రవేశమవుతున్న సాహిత్య అధ్యయనమా,
ఇది సామజిక శాస్త్రాలతో కూడుకున్న
కార్యాచరణ పద్ధతా?. ఇవన్నీ నేడు పలువిధాలుగా ఎకాడమిక్స్ ముందున్న సవాళ్లు.
ప్రకృతి(ఇకాలజి), పర్యావరణం(ఎన్విరాన్మెంట్)
అన్నవి వేరు. ప్రకృతి అన్నది సమస్తభ్రమాండకోటి. పర్యావరణం అన్నది పంచభూతాల సృష్టి. ఇక పర్యావరణం,ప్రకృతి లో
తరుచు వినే పదం న్యాచురల్ అంటే సహజమైన .
ఇది ఎలా అంటే ప్రతి రచయతను /రచయత్రిని తరుచు అడిగే ప్రశ్న ,మీరు రాసేది సగటు మనిషికి
అర్ధం అవుతుందా ? ఇక్కడ నేను చూసే తీరు, నాకు నేను చెప్పుకునేది నాలోనే సగటు మనిషి
వున్నాడు ఆ మనిషి గా రాస్తే ముందుగా నాకు
అది సహజంగా అనిపిస్తుంది లేక పొతే అది అసహజమే. ప్రకృతి రీత్యా
మనిషి అసహజం ఎందుకంటే మనని మినహాయిస్తే మిగితా
ప్రాణులన్నీ తమ చుట్టూ వున్న
పర్యావరణానికి అనుబంధంగా జీవిస్తాయి. మనమే పర్యావరణాన్ని మనకి తగ్గట్టు గా
మల్చుకుంటాం. కనుక మానవ సమాజ ఎదుగుదల
అన్నది ప్రకృతిని అసహజంగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియనుండే సాహిత్యం,కళలు,సంస్కృతీ
ఏర్పడ్డాయి. ప్రకృతి భాషని మనం రాయలేదు, మన భాషని, సంస్కృతిని ప్రకృతికి ఆపాదించం.
ఇక సాహిత్య విషయానికి వస్తే కధ ,కధానిక,
నవలలో పాత్రలు,పాత్రదారులుంటారు వాట్ని అనుసారంగా రచన సాగుతుంది, ఇక కవిత్వం విషయానికి వస్తే కవే అన్నీ.
కవిత్వం అన్నది నది చెట్టు , కవి ఆ నది చెట్టుని అధిరోహించే నీటి నిచ్చెన. చెట్టు భూమిలోని నీరుని తన కాండం ద్వారా ఆకులకి ఎలా సరఫరా చేస్తుందో అదే విధంగా కవి/కవయిత్రి తమ భావాల్ని పాత్రల ద్వారా కాక నీటి
ఆకుల ప్రతీకల ద్వారా వ్యక్త పరుస్తారు. అవి ఏ రూపంలో ఎవరికి ఎలా అందుతాయో అన్నది
చెప్పలేం. కాని పక్షులు మటుకు తొలి కిరణం రాక మునుపే ఆకుల మీద వున్న
నీటి బిందువులతో దాహం తీర్చుకుంటాయి. అదే
వెదురు పొద అయితే వెదురాకు అంచునుండి
ఒక్కో బొట్టు రాలుతుంది అదే బహుశా హైకూ నేమో.
కవిత్వం రాస్తునప్పుడే అది మన మదిలో ఇన్
ప్రింట్లో కి వచ్చేస్తుంది మనం కాగితం మీద, .సిస్టం మీద చూస్తున్నదంతా కృత్రిమ
రూపం. రూపం ,భావం ఏకమైనప్పుడు అది సహజంగా
నే వుంటుంది.
మనం అంతా కామన్స్ , గ్రీన్ పాలిటిక్స్ కి కార్యాచార్యణ
చేసిన ఫ్రిజ్ ఆఫ్ కాప్రా అన్నట్టు మన విస్డమే అన్ కామన్. ఆప్పుడు
ఇప్పుడు వున్నది సహజమైనది కాదు , అక్షరం ద్వారా సహజమైనది అన్నదాన్ని చదివే వారి మదిలో చాలా గ్లోరిఫై చేసి నాటాం. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. మనం
పర్యావరణం గురించి రాసే తీరు, మారింది అంటే మన చుట్టూ వున్న దాంట్లో సహజ మైనదాని స్ధానం తగ్గుతూ వస్తోంది. ఆలా తరుగుదలలో అసహజ(కృతిమ)
మైనవి చోటుచేస్కున్నాయి, అందుకే మన ప్రతీకలు మారుతాయి, ఇది మననంతట మనం మన సాంకేతిక పరిజ్ఞానం, మాధ్యామాల ద్వారా ఏర్పర్చుకున్న
పరిభాష. ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఆ సినిమా నిడివి
చిన్నది అన్నది కాదు, మన దగ్గర చూసే సమయం అంత లేదు అని నేను అర్ధం చేస్కుంటా. ఆ తక్కువ
సమయం లోనే ప్రేక్షకుడిని ఆకట్టు కోవాలి.
అది ప్రకృతి తో సాధ్యం కాదు అతి తక్కువ సమయంలో ప్రకృతిని పునరావృతం చేయలేము.
కాలుష్యం పరిధి దాటిని నప్పుడు ఆడ్ ఈస్
ఆడ్ ఈవెన్ ఇస్ ఈవేన్. సమూహంగా జీవించ లేక వ్యక్తిగతంగానే కాలాన్ని ,సమయాన్ని
జయించాలన్న కోరిక తో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని విస్మరిస్తాం . అదే ఆడ్నెస్ . ఒక
జీవనం అన్నది నగరం ,అందులోని నివాసులు కారు , ఒక ఆవాసం చుట్టూ అల్లుకున్న ప్రకృతి.
అందుకే ఇప్పుడు డిల్లీ అబ్ బహుత్ దూర్ హో
గయా . కాలి ఘటా చాగయి(ఇప్పుడు డిల్లీ చాలా దూరమైయిపోయింది దాని చుట్టూ నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి). కేవలం పరిశ్రమలు, ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల
తాత్కాలిక పరిష్కారాలు దొరుకుతాయి తప్ప దీర్ఘ కాలిక మైనవి కావు. ఈ మధ్యనే భోపాల్ గ్యాస్ ఉదంతం జరిగినప్పుడు జన్మించిన
పిల్లల పై ఆరోగ్య పరమైన తీవ్ర ప్రభావాలుంటాయి అన్న నివేదిక వేలువడింది. మరి ఇదే
విషయం నేటి డిల్లీని చూస్తే భయం వేస్తుంది. పర్యావరణ కార్యకర్త, రచయితా ఇయాన్ మెక్
కలం అన్నట్టు మనం ప్రకృతి
దుష్పరిణామాల్ని సంకేతాల్ని
శాస్త్రీయంగా పట్టించుకోకుండా వున్నప్పుడు
, ఒక స్వరం మననని తట్టిలేపోతుంది. అది కవుల గళం. ఆ గొంతుని వినడం అంటే మన ఆత్మ బాషని
వినడం.ఇది వినడం అంటే మనలో నిఘూడంగా వున్న సమైక్యత మృగత్రుషణ సవ్వడిని వినడమే.
ప్రపంచ చివరి రోజున
మెర్విన్
|
ఒక చెట్టుని నాటాలనుకుంటున్నా
|
దేనికోసం
|
పండు కోసం కాదు
|
కాయలిచ్చే చెట్టు
|
నేను నాటినది కాదు
|
నా చెట్టు నిలదొక్కునది!
|
భూమిలో మొదటి సారిగా
|
అప్పటికే అస్తమిస్తున్న
|
సూర్యుడు
|
ఇక నీళ్ళు
|
వాటి వేర్లని తాకుతూ
|
శవాల మడుగైన భూమి
|
ఇక మబ్బులు ఒకటి ఒకటి గా
|
తమ ఆకుల నుండి
|
వీడుతు...
|
కవితలు కొద్దిగా నిఘూడంగా వున్నా మన జీవితాల
గురించి చాలా తెలుస్కునేటట్టు ఎలా తెలిచేస్తాయో? బహుశా అదే నెమో కవిత్వానికి
, పర్యావరణానికి వున్న సంభందం. మెర్విన్, అమరికన్ కవి,రచయిత, పర్యావరణ
కార్యకర్త, ఈయన ప్రకృతి సంరక్షకుడు, తన ఇంటి నుండి
,చుట్టూవున్న ప్రకృతి నుండి ప్రేరణ పొందాడు, తన జివతకాలంలో 2000 చెట్లు నాటాడు.
పై కవిత ఒక ఆంత్రపోజేనిక్ దృక్పధం తో కాక బయో
సెంట్రిక్ దృక్పధం తో కూడుకున్నది. భూమికి
అధిపతిని అన్న ధోరణి కాక ప్రకృతికి కావలి
దారుడిని అన్న ఆకాంక్ష వ్యక్తమవుతుంది. ఇక ప్రపంచం అంతరిస్తున్నప్పుడు చెట్టునే
నాటాలన్న దానిలో నిఘూడమైన శాస్త్రీయ ఆలోచన వుంది. ఈ మధ్యనే లక్నో లో జరిగిన 6వ ఆషియా దేన్ద్రోక్రోనాలజి(చెట్టు
బెరడు పై జరిగే అధ్యయనం) లో గతంలోని పచ్చదన్నాన్ని
పసిగట్టేందుకు దేన్ద్రోక్రోనాలజి ఎంతగానో
ఉపయోగపడడమే కాక వాతావరణ మార్పులని నివారిస్తుంది అని. చెట్టు బెరడులో అపార మైన సమాచారం
వుంటుంది, అది ఒక విధంగా జీవావరణ సమాచార అధార్ కార్డ్ . చెట్టి వయస్సుని దాని బెరడుతొ
అంచనా వేసే పద్దతి ఎప్పటి నుండో కొనసాగుతోంది. మన ముఖం పై వున్నముడతల ద్వారా మన
వయస్సు ని ఎలా గమనించవచ్చో అలానే చెట్టు బెరడుని బట్టి గత జీవావరణ స్తితిగతులని.
వాతావరణ మార్పులని అంచనా వేయచ్చు. చెట్టు ఆకులంటుకున్న ధూళిని బట్టి ఎటువంటి ప్రదేశంలో మనం బతుకు తున్నామో కూడా చెప్పొచ్చు. ఆకుల పై వున్నధూమ్ము ,ధూళి మన రోజుల తీరుని
చూపుతాయి, అందుకే మబ్బులు ఒక్కొక్కటిగా ఆకుల్లా రాలిపోతాయి.
ఇప్పుడు మనం పండుటాకుల్లా
రాలే కాలం పొయ్యింది, కనీసం ఎండుటాకుల్లా కూడా కాదు..., కలుషిత ఆకుల్లా రాలి పోయే
రోజుల్లో వున్నాం. మనం ఒక ఆడ్ మ్యానర్లో
వున్నాం, ఈవెన్ గా మారెందుకు చేసే ప్రయత్నం లో కొనసాగుతూ...
0 comments:
Post a Comment