Saturday, 4 April 2020 By: satyasrinivasg

చీకటి పొరలు




లార్డ్ బైరాన్ చీకటి కవిత లోని  మిగతా పంక్తుల్లోకి

జంతువులు ఆకలి తీరక వాటి నాలకల్ని బయటకు జాపుకునున్నాయి,
జాలితో కూడిన మూలుగుతో,
అంతలోనే అతని  చేతుల్ని నాకుతూ  ఒక  నిర్దయ రోదన,
సుశ్రూషతో కూడిన సపర్య  కాదు- అతను మరణించాడు.
కరువు కాటకాలతో  కుప్పలతెప్పలుగా  జన సమూహం  ; కాని ఇద్దరు
మహా నగర వాసులు బతికే వున్నారు,
వాళ్ళు శత్రువులు:పక్కపక్కనే కలిశారు
బలి-ప్రదేశంలోని  బూదిదలా మృతిచెందుతున్న వాళ్ళు
కుప్పల కొద్దీ పేర్చివున్న పరిశుద్ధ వస్తువులు ఏర్పరిచిన  చోట
అపరిశుద్ద  వినియోగానికై ;పేర్చుకున్నవి
వణుకుతున్న వాళ్ళ చల్లని ఎముకల చేతులతో పేర్చుతూ
మిగిలిన కొద్దిపాటి  బూడిద, వాళ్ళ నిర్జీవ శ్వాస
కొద్దిపాటి జీవితం కోసం నిప్పుని రాజుకుంటూ  ,వూదుతున్నారు
అదంతా ఆవహేళన ; తర్వాత లేచారు
వాళ్ళ కళ్ళు, మందగిస్తున్న చూపులతో 
ప్రతి ఒక్కరి  అంశాన్ని- చూస్తూ, అరుస్తూ, చనిపోయాయి-
ఒకరికొకరు పరిచయం కాకుండానే  మృతిచెందారు ,
ఎవరి భుజం పైన ఎవరు వాలి  చనిపోయారో సైతం తెలియదు
మహమ్మారి కరువు వాక్యం . ప్రపంచం శున్యం,
 ప్రఖ్యాతిగాంచినవి,అధికారమైనవి అంతా కుప్పలు,
ఋతువులు  లేవు, ఔషధాలు లేవు , చెట్లు  లేవు ,మనుషులు లేరు,జీవమూ  లేదు-
 చావు కుప్పలు- గుట్టల  కొద్దీ సున్నపు మట్టి.
నదులు, తటాకాలు,సముద్రాలు అన్నీకదలలేని స్దితిలో ఆగిపోయాయి,
ఇంకేమీ కదలికలు లేని వాటి నిశబ్ద లోతులు ;
 కుళ్ళిపోతున్న సముద్రంలో నావికులు లేని ఓడలు,
కొద్దికొద్దిగా పడిపోతున్న ఓడ  పైని జెండాలు : అవి పడిపోతున్నపుడు
 అలలు లేని  చోట అవి లోతుల్లోకి కురుకుపోతూ-
కెరటాల  సమాధుల్లో అలలు మరణించాయి;,
చంద్రుడు,అతని ప్రియురాలు . ముందుగానే శ్వాసవదిలారు;
చలనంలేని  గాలిలో వాయువులు చెల్లాచేదురయ్యాయి,
మబ్బులు అంతరించి పోయాయి; చీకటి  ఇక  అవసరం లేదు
వాటి సహాయమునూ- ఆమె విశ్వం.
 ---
చీకటిలోని ఆంతర్యం...అంతటి పరితిస్దిలోనూ ఒకే ఒక కుక్క తన యజమాని శవానికి కావలి కాస్తూ , ఎవరినీ దాని దరిచేరనీయకుండా ,శవం చేతులు నాకుతు ,రోదిస్తూ అక్కడే వుండింది. అది ఒక్కటే ఈ ప్రపంచంలో మంచితనానికి, చిహ్నంగా వుండి,  చెడుని, చీకటిని  దరికి చేరనీయకుండా , మిగిలి,  చివరికి ప్రాణం వదిలింది..
బలి-ప్రదేశంలోని  బూదిదలా మృతిచెందుతున్న వాళ్ళు అంటే కేవలం  జన సమూహం అని కాదు మొత్తం మానవాళి అని  కవి చెబుతున్నాడు.వాళ్ళందరూ ఒకే తరుణంలో చావలేదు , మెల్లి, మెల్లిగా మృతిచెందారు. ఇద్దరు మనుషులు, బతికి వున్న మహానగర మనుషులు, శత్రువులయ్యారు వాళ్ళు ఆడం ,ఈవ్ ల పుత్రులు కైన్, అబెల్. వాళ్ళిద్దరూ ఒక బలి ప్రదేశంలో కలిశారు అక్కడ  పరిశుద్ధ వస్తువుల్ని అపరిశుభ్రంగా వాడుతున్నారు. ఆక్కడ దహనమవుతున్న శవాల వద్ద మోకాళ్ళ మీద కుర్చుని బూడిద ఏరుకుంటున్నారు.దేవుడు వీళ్ళకి పరీక్షపెట్టాడు , కాని ఇక ఏ దిక్కు  లేని  సమయంలో తిరిగి పాత మత దారే పట్టారు. ఆ కొద్ది పాటి  బూడిద నుండి నిప్పు రగిలించి ఒకరి మోకాలు ఒకరు చూస్కుని విస్తుపోయారు. లేక అటువంటి దుర్భర పరిస్ధితుల్లో కూడా ఘర్షించు కున్నామా అని   భయపడ్డారు, వాళ్ళు చనిపోయారు. ఎప్పటికి,  ఎవరు నీతిమంతులో మనుషులు గుర్తించలేక పోయారు. ఒకరినుండి ఒకరు తమని గుప్తంగా వుంచుకుంటూ... ఇప్పుడు ప్రపంచం  జీవం లేనిది, అధికారం ,ప్రఖ్యాతలు అంతా బూడిదలో కలిశాయి.దేవుడో, మరో శక్తో ప్రపంచాన్ని శూన్యంగా మార్చింది.. చీకటి సృష్టి కర్త అంతటా తిరిగి సమానత్వాన్ని సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచం అంతా సమానమే. గాలి ,వాయువులు,ఓడలు అన్నీ ఎక్కడవక్కడే నిశ్శేష్టులయ్యాయి, ఇక చీకటికి అండదండలు,సహాయము  అవసరం  లేదు. అది విశ్వం అయ్యింది.
కవి చివరిలో  అంతిమ రోజుల్ని ఓల్డ్ టెస్టమెంట్ భగవత్ వాక్కుతో ముగించాడు. ఇప్పటి మన పరిస్ధితి బహుశా ఇలానే వుంది. ప్రపంచమంతా  లాక్ డౌన్ అయ్యి కొన్ని ఏళ్ల వెనకకు చీకట్లోకి  వెళ్ళింది, ఎంత వెనకకి పోతున్నాయో  ఆయా దేశాల అభివృద్ధి సూచికలనూ గమనిస్తే తెలిస్తుంది. అది  నేడు నిర్మానుష్యమైన రోడ్లని  చూస్తుంటే   400 ఏళ్లకూ పైగా వున్న  హైద్రాబాద్, ఎప్పటి హైద్రాబాద్లా వుందో  పెద్దవాళ్ళు చెప్పగల్గుతారు. కోటిని, ఒక్కప్పుడు తురేబాస్ ఖాన్ రోడ్ అనే వాళ్ళు, గాంధి మెడికల్ కాలేజ్ ఎదురుగుండా వుండే పోలిస్ స్టేషన్ దగ్గర  ఆ బోర్డ్ కూడా వుండేది, తురేబాస్  ఖాన్ అనే ఆయన 1857 లో బ్రిటిష్ రెసిడెన్సి(విమెన్స్ కాలేజ్) ఎదురుగా తిరుగుబాటు చేశాడు, అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు అ రోడ్డు బహుశా అప్పటి కాలండి గా కనిపిస్తోంది.



ద నేకడ్ ట్రూథ్ ఆఫ్  గ్రీన్ డార్క్ నెస్
లార్డ్ బైరాన్ చీకటి  కవిత నేటి పరిస్ధితులకు అద్దం  పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం కరోన వైరస్ అన్నది ప్రకృతి సిద్ధంగా పుట్టింది తప్ప కుట్ర దారుల సిద్ధాంతాల ప్రకారం ల్యాబ్ లో జననం పొందలేదు. ఈ కరోన  వైరస్ వల్ల నేడు ప్రబలుతున్న రెండు రకాల వైరస్లకూ మరొకటి జతకూడింది. ఎపిడెమిక్( ఒక ప్రాంతంలో పరిమితమైన అంటురోగం) ప్యాన్డమిక్(  స్దానికంగానేకాక విస్తృతంగా ప్రభలే అంటురోగం) మూడవది, కొత్తది ఇన్ఫోడేమిక్(అంటే  తప్పుడు సమాచారం తో ప్రభలే అపోహల అంటురోగం). బాగా ప్రచారమైన అపోహ ఏమిటంటే SARS-COV-2   వైరస్ని లాబ్ లో సృష్టించారని, (W.H.O నిర్దారించేది అది ప్రకృతి పరంగా గబ్బిలం లేక పాన్గోలిన్ అనే జంతువునుండి వచ్చిందని(కచ్చితంగా చెప్పలేదు) ది నేచర్  మేడిసన్ అన్న జర్నల్ లొ ప్రచురించారు. ఇది వైరస్ రూపం, దాని వెన్నముక పై నిర్దారించినది.)  నేడు మొదటి రెండిటికంటే మూడవది చాలా వేగంగా ప్రపంచమంతా ప్రభలింది. ఎందుకంటే ఈ సమాచారాన్ని మనం మన  బొటని, చూపుడు వేళ్ళతో త్వరితంగా పరివ్యాప్తి చేస్తాం.  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైతం మినహాహింపు కాదు, చైనాని దుమ్మెత్తి పోశాడు, W.H.O  ఆ అవాక్కు చవాకుల్నిఅడ్డుకుంది. నేడు అమెరికా ఇటలి తర్వాత అంత తీవ్ర స్ధాయిలో ప్రభావితమయ్యింది , దీనికి ఎవర్ని దుషించాలిచాలి.
 కవి లార్డ్ బైరన్ అన్నట్టు, నేడు సోషల్ మీడియాలో వైరస్ కీ సంబంధించిన వాస్తవాల కంటే అవహేళన బాగా సోకుతోంది. నేడు కరోన ప్రభలిన, దేశ పాలక రాజకీయ  పార్టీలన్నీ, W.H.O, మొదటి రెండిటిని శాయశక్తులా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికి మూడోది వాళ్ళ అధినంలో  లేదు. ఈ వైరస్ భీజం  ద్వారా తెలిసే కీలకమైన అంశం, వ్యక్తిగత నడవడిక నుండి, వ్యవస్ధ స్ధాయి వరకు మార్పులు చేస్కోమని . వ్యక్తిగత, సాముహిక, సామాజిక నడవడిక తీరుని నియత్రించేందుకు  మందులూ మాకులూ లేవు, చట్టాలు, అధికారాలు తప్ప, కానీ అవి కూడా  మనిషి సృష్టించుకున్న విపత్తులు(కులం, మత,జాతి వగైరా ఘర్షణలు, యుద్ధాలు వగైరా..) ప్రకృతి(ఇందులోనూ మానవ ప్రమేయం వుంది) సృష్టించినవి.మొదటి దాంట్లో ప్రపంచ చివరి రోజులు అన్న భయం వుండదు, రెండవ దాంట్లో ముఖ్యంగా సంక్రమిత రోగాలు, ఇతరత్రా గ్రహాంతర దాడి వల్ల అపోక్యాలిప్స్(ప్రపంచ అంతం ) అన్నది ఐమిడి వుంటుంది.  అ మొదటి విప్పత్తులలో మానవ నడవడిక తీరుకి, రెండవ దాంట్లో నడవడిక తీరుకి చాలా వ్యత్యాసం వుంటుంది. ఇవి గమనించి మనం ఏ వైరస్ని ఎలా అరికట్టాలి అన్నది ఆలోచించేటప్పుడు, వైరస్ భౌతిక అస్తిత్వాన్ని, అది పయనించే మార్గాన్ని గమనిస్తాం ,అది దూరే మార్గం. నేటి (అర్బోసెంత్రిజం) సమాజంలో మనిషి ఎప్పుడో తన నుండి, తన కుటుంభం నుండి, సమూహం,సమాజం నుండి ఐసోలేట్ అయ్యాడు. ఇప్పుడు సామూహిక సమాజం అన్నది వర్చువల్ రియాలిటి(పాపులర్  సినిమా ,సీరియళ్ళులా   ) ప్రతి వ్యక్తి ఇప్పుడు సెల్ఫ్ సెంట్రిక్.  తన గడపెదుటే చావు వుంది, లేక దారిలో వుంది అని చెప్పినా , రేపు తనకు కావాల్సిన అవసరాలకి తగ్గటుగా సరుకులు పేర్చుకోవాలి అన్న ఆరాటం ఎక్కువ, మరి అదే పరిస్ధిని వర్తకులు, మధ్య వర్తులు  లాభం గా మార్చుకోవటం లేదు!. ఇక్కడ చావు కాదు కీలకమైనది, అవసరం,ఆ అవసరాన్ని ఎలా, ఎవరు, ఎందుకు మల్చుకుంటారన్నది కీలకం.  సో వాట్ ఈజ్ రియాలిటి?
ఒక మంచి, చెడు వల్ల రెండు తప్పనిసరిగా జరుగుతాయి, లేటేంట్ అండ్ మ్యానిఫెస్ట్ ఫంక్షన్స్. అంటే ప్రత్యక్షంగా,పరోక్షంగా జరిగే చర్యలు. ముఖ్యంగా పరోక్షంగా జరిగే చర్యల్ని అంచనా కట్టాలి. నేటి అర్బోసెంత్రిజం(నగరీకరణ చుట్టూ అల్లుకున్న అభివృద్ధి దృక్పధం)  తోవలో సోషల్ ఫెన్సింగ్ (సామాజిక కట్టుబాటు ) అన్నది కనుమరుగైయ్యింది.
మనం ఏదో మన ఆచారాలని  గొప్పగా  చెప్పుకుంటాం కానీ మన ఆచారాలలోని కట్టుబాట్లు క్షీణించి చాలా కాలమయ్యింది, ఇక ఆచారాలు , కట్టుబాట్లు అన్నవి ఎప్పటికీ స్ధిరంగా ఉండేవి కావు. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నార చీరలు చూశాం, నేడు ప్రతి సీరియళ్ళలో  రాత్రి పడుకునేటపుడ్డు కూడా  పట్టు చీరలు .నగ నట్రాతో  పడుకునే రోజులోచ్చాయి. సమాజం కోసం వ్యక్తిగత నియంత్రణ రోజులు చెల్లాయి, సామాజిక హితం కోసం వ్యక్తి, సమాజం రెండు వ్యవస్ధలూ పాలనా యంత్రాగానికి, ప్రభుత్వానికి అప్పచెప్పేశాయి.  మనమందరం సమస్య గురించి కొద్దో గొప్పో అవగాహన  వున్న వాళ్ళమే ,కానీ కొరవడిందల్లా, సునిశిత. అందుకే అంతా చట్ట పరంగానే, జరగాలి. సామాజిక కట్టుబాట్లతో నడవాలంటే అది గ్రామాల్లో చలామణి అయ్యే అవకాశం వుంటుంది కారణం అక్కడ ఇంకా , కుల, మత ,జాతి,రాజకీయ,వ్యక్తి పలుకుబడి   అన్న సామజికమైన వ్యవస్ధలు చలామణిలో వున్నాయి. అక్కడ ఇంకా మట్టి వుంది, ఆ మట్టి లో    ఆ రసాయనాలున్నాయి. నగరం లో మట్టి లేదు, ఇక్కడి జీవనం ఏకాకి జీవనం , ఇది వాస్తవం, ఇదే ఇక్కడి జీవావరణం.
మనం తరుచు చేసేదల్లా  విపత్తుని  ప్రత్యక్షంగా జమకట్టడం. ఆ తాపత్రయం లో విపత్తుకి గురైన వాళ్ళని కేవలం అంకెలుగా జమకడతాం, ఇది  నేటి  మ్యాక్ నామిక్స్ (లెక్కలతో కూడుకున్న ఆర్ధికశాస్త్రం, గతంలో ఆర్ధిక శాస్త్రంలో స్టాటిస్టిక్స్ ఎక్కువ గా వుండేది,అంటే అంకెలు  నేడు లెక్కలు). ఐ మ్యాక్ నామిక్స్లో జీవం, ప్రకృతి విలువ కేవలం బతుకుతెరువు,ఆర్ధిక స్ధాయి అన్నది ముఖ్య అంశం, జీవించడం అన్నది కాదు. నేడు అభివృద్ధి అంచనాలలో డబ్బే కాక, హ్యాపీ లివింగ్ (సంతోషకరమైన జీవనం) అన్నది పరిగణలోనికి తీస్కుంటున్నారు.   ఇదంతా మనకి అర్ధం అవ్వాలంటే  ఆర్ వి న్యాచ్యురల్! నో, అదే పచ్చటి చీకటినుండి వెలుగులోకి వచ్చే వాస్తవం.
ఏ విపత్తు వచ్చినా,అ విపత్తుకి గురైన వాళ్లకి ముందుగా కావల్సింది మనో ధైర్యం, అది డాక్టర్లు ఇవ్వలేరు, పాలకులు ఇవ్వలేరు..  కారణం వైరస్ సోకిందన్న బాధ కంటే వాళ్ళని  కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళు  ,సమాజం వేలేస్తారాన్న భయం ఎక్కువ,  ఇది వాస్తవం!. ఆ భయం నుండి  కేవలం, కుటుంబికులు, చుట్టుపక్కల వాళ్ళు, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్, ఇవ్వగల్గుతారు.  ఐసోలేషన్లో వున్నవారికంటే లేని వారి వల్ల ఇక్కట్లు ఎక్కువ. కారణం  ఏమి తోచక అటూ ఐటు పరిగెడుతారు, గుసగుసలు మొదలెడతారు. ఇక మన మీడియా ప్రపంచం దీనికి అతీతం కాదు, భయపెట్టించే డేటా ని సమాచార రూపంలో అందిస్తుంది. విశ్లేషణ తో కూడిన సమాచారం తక్కువ . మనకి డేటాకి, సమాచారానికి తేడా కూడా తెలియాలి. డేటా అంటే అంకెలు, లెక్కలు, వీటిని క్రోడీకరించి విశ్లేషించి వ్యక్తపరచడం, సమాచారం. నేడు ప్రపంచమంతా డేటా ఆధారంగా గారడీ చేస్తోంది. ముఖ్యంగా విపతులప్పుడు, అందులోనూ డేటాలో ని క్వాలిటేటివ్(నాణ్యత), క్యాంటిటేతివ్(అంకెలు) అన్న దాంట్లో ఎక్కువగా మొదటికి చెందినదే వుంటుంది, ఉదా: విపతులప్పుడు ఎంతమంది చనిపోయారు అనే వుంటుంది తప్ప ,సామాజిక ,ఆర్ధిక, సామాజిక జీవావరణ నష్టం కొలమానం లోకి రాదు!     దృశ్య, పత్రిక మధ్యమాల్లో ఎందుకు రావంటే మన మాధ్యమాలకి అంత విస్తృత అవగాహన .పరిజ్ఞానం లేదు, కారణం పరిశోధనా లోపం.
 కేవలం విపత్తు వచ్చినప్పుడు ఇవి ప్రసారం అవుతాయి, విపత్తు పోయిన తర్వాత అంతా  మామూలే , రాజకీయ ,క్రీడా , ఎంటర్ టైన్మెంట్  వార్తలు. ఈ ఘటనలు తాత్కాలికం  కనుక ఇవన్నీ టైం బీయింగ్ రియల్, ఇంకా జస్ట్ డేటా అంతే. తర్వాత వర్చ్యువల్.  ఇది ప్రకృతికీ, సమజానికీ అన్నిటికి సంబంధించినది, అవి సెన్సేషన్గా వున్నంత కాలమే వాటి జీవం. ప్రకృతి అన్నది మనకి వర్చ్యువల్ ఇట్స్ నాట్ రియల్. కారణం అన్ని వేళలా దాని విపత్తు వున్నా అది అలవాటై పట్టించుకోము, ఉదాహరణకి కాలుష్యం. కాలుష్యం అన్నది అభౌతిక మైనది కాదు , అది నేడు మన స్వాభావిక నైజం. అందుకే ఎన్ని కట్టడిలు చేసినా రోడ్డు మీదకి వచ్చే వాహనాషులు(వాహనదార్లు) వస్తూనే వుంటారు, పోతూనే వుంటారు. డార్క్ ఎకాలజి ప్రకారం దూరం వున్న బ్లాక్ హోల్ ని అర్ధం చేస్కోవడం సులభం కానీ దగ్గర వున్న మనిషి ఆలోచనల్ని అంచనా వేయడం బహు కష్టం! ఒక విపత్తు  అప్పుడే కలవలేని కులమతస్తులం ,ఇక కలిసికట్టుగా పర్యావరణాన్ని సంరక్షించి  క్లైమేట్ చేంజ్ని ఏమి అరికడతాం?   మార్కెట్ ఎకానమీ లో మనిషి ఎప్పుడో మార్కెట్ పాలకుల అధినంలోకి ఇమిడిపోయాడు,మనని మనం నియత్రించుకునే స్ధాయి, స్తోమతలో లేము , మనం ,మన జీవనం ,జీవితం అంతా మార్కెట్ పిడికిళ్ళలో వుంది . ఆ పిడికిళ్ళు విప్పితే తప్ప రహస్యాలు బయట పడవు.
నేడు  కరోన ఆ  గుప్పిట్లని విప్పుతోంది. మనం ఇళ్ళలోకి వెళ్ళి తలుపుల్ని వేస్కున్నా , గ్లోబల్ మార్కెట్  గదుల్లోని నియో లిబరలిజం రహస్యాల్ని  కుల్జా సిం సిం అంటూ బట్టబయలు చేస్తోంది...

0 comments:

Post a Comment