Monday 3 May 2021 By: satyasrinivasg

చెట్లమ్మ-వంగారి మాతాయి


వంగారి మాతాయి

అల్లా రేనిబోజార్త్

పురుషులకు ఆమె తలొగ్గలేదు

ఆమె కేవలం భూమికి, నేల తల్లికి మాత్రమే తలొ౦చింది

ఆమె పురుషులకు వాళ్ళ మెదళ్ళలోని  హింస గురించి వాస్తవాలు చెప్పింది

అందుకు వాళ్ళు ఆమెని హింసించి బంధి౦చారు , ఆమె శరీరం కోలుకుంటున్నప్పుడు

ఆమె ఆలోచనలు ఇంకా శక్తి వంతమై౦ది, ఆమె గళం విజ్రు౦భించింది

 ఆమె  మాటలు కొనసాగించింది

ఆమె  స్పష్టమైన తల్లి గొంతుతో మన తల్లి గురించి మాట్లాడుతుంది

భూమిని హింసించకండి, పిల్లల్ని కూడా.

నగరంలోని వనాన్ని పెకిలించి అక్కడ ఎత్తైన భవంతిని కట్టాలన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనను

ఆమె నిక్కరించి అడిగినప్పుడల్లా , మెదళ్ళలో హింసాత్మక 

ఆలోచనతో వున్న పురుషులు ఆమెని  మళ్ళీకొడతారు

కాని, ఆమె గెలుస్తుంది. విజయం  తర్వాత విజయాన్ని, ఆమె నిరంతర కష్టం వల్ల భూమి గెలుస్తుంది

ఆమె తన పేదరికాన్ని, నిర్జీవమతున్న భూమి గురించి వ్యక్తపరుస్తుంది

ఇంకా  ఆమె చెబుతుంది, మహిళలు, పిల్లల పై జరుగుతున్న అణచివేత ఒకటేనని

ఆమె చెట్ల గురించి కలలు గని వాట్ని నాటుతుంది.

కాని అది చాలదు. ఆమె పేద మహిళల గురించీ కలలు కంటుంది

భూమి అంతటా జివనోపాధి లబించాలని ఆమె చెట్లు నాటుతుంది.

ఆమె మహిళలు సంఘటితం అవ్వడానికి పిలుపునిస్తుంది- అదే హరితహార ఉద్యమం.

ఆమె ఇచ్చిన స్పూర్తితో ఇక వారు వెనకంజ వేయరు.

 జంతుశాస్త్రంలో ప్రొఫెసర్ అంతే కాదు జీవరాసులకు ప్రాణప్రధాత

ఆమె మహిళలకు  మొక్కలు నాటడానికి కొద్ది పాటి పారితోషికం ఇస్తుంది.

 మెల్లి మెల్లిగా అడవులు తన జన్మభూమి కెన్యాలోకి తిరిగి వస్తాయి.

 చిన్నప్పుడు ఆమె ప్రేమించిన  నదులు, వాగుల  స్పూర్తి వాక్కులు ఆమెకు జ్ఞాపకం వున్నాయి.

హింసాత్మక ఆలోచన గల మగాళ్ళు భూమిని హింసించిన తీరు

అత్యాశ పరుల ముందు భూమి తల్లి ఎలా వుండేదో ఆమెకు జ్ఞాపకమే!

వృక్తిగతమైన , వృత్తిపరమైన  దౌర్జన్యం జరిగినప్పుడు   ఆమె పార్లమెంట్ దృష్టికి తీసుకువెళుతుంది

 అధికార పాలక పార్టీని ఓడించి నేషనల్ రెయిన్ బో సమన్వయ పార్టీ  అభ్యర్దిగా గెలుస్తుంది

పర్యావరణ,సహజ వనరుల  మంత్రిత్వ శాఖలో ఆమె ఉప మంత్రి అయ్యింది

అభ్యర్డులని గ్రీన్ బెల్ట్ మూమెంట్ దిశ గా ప్రోద్భలించడానికి కెన్యా మజిరంగ గ్రీన్ పార్టీని  ప్రోత్సహించింది

తర్వాత అది ఆఫ్రికా గ్రీన్ పార్టీస్ ఫెడరేషన్ లో, గ్లోబల్ గ్రీన్స్ లో  సభ్యత్వం  పొందింది

హింసాత్మక ఆలోచనల పురుషులు ఆమెని హింసించినప్పుడు

ఆమెకి ఫ్రాన్స్ ప్రజలు లిజియన్ ఆఫ్ హానర్ తో సత్కరించారు

భూమి పైన శాంతి,మానవత్వం కోసం పనిచేసే ఆమెకు ప్రపంచం నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చినప్పుడు

కుళ్ళిన మెదళ్ల మగాళ్ళు ఆమెను ఇష్టమొచ్చినట్టు మాటలతో గాయపర్చి,దూషించినప్పుడు

ఆమె నిజాయితీ గెలిచింది

ఆమె ఇప్పుడు మనని విడిచి వెళ్ళింది, కాని ఆమె తల్లి లాంటి వాక్కు 

ఇంకా స్పష్టంగా ,గట్టిగా ప్రతిధ్వనిస్తూనే వుంటుంది

ఆమె నిజాయితీ పలుకులు ఇంకా గట్టిగా ,స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి.

 ఇక ఆమెని ఎవరూకొట్టలేరు, ఆమె స్పూర్తి ఇంకా పలుకుతూనే వుంటుంది

మనమందరం ఆమెని విన్న వాళ్ళం , వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళం

ఆమె పలుకులు మన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి స్పూర్తినిస్తూనే  వుంటాయి

విన్న వాళ్ళు ,పలికే వాళ్ళు, పిల్లలకి ఆశని ,బలాన్నిఅందించాలి

అవి భవిష్యత్తు పలుకవ్వాలి.

ఇప్పుడు వినే వాళ్ళు,

రేపటికి అందించండి-

(అనుసృజన -జి.సత్యశ్రీనివాస్)

అవును ఇప్పుడు వినే వాళ్ళు ,రేపటికి  మాటల్ని చేతలుగా అందించండి. అప్పుడు పుడమి వాక్కు నేలకి పచ్చటి తోరణాలు కడుతుంది. ఇది జరగాలంటే చెట్లను నాటుతునప్పుడు ప్రతి ఒక్కరి అవసరాల్ని, ఇష్టాలని గ్రహించి చెట్లు నాటాలి. లేకపోతే హరిత హారం కూడా మొక్కలు నాటడం  అనేమరో హరితమైన వ్యాపారం అవుతుంది.వంగారి మాతాయి 1976 లో నేషనల్ కౌన్సిల్ లో కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసేటప్పుడు  భూమి పైన పచ్చదనంతో బాటు మహిళకు వంటచెరకు, ఇతరత్రా అవసరాల కోసం వనరుల కొరతను అరికట్టడానికి చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టింది. అది క్రమేణా నలుదిశలా వ్యాపించింది.1986  నాటికి ఆఫ్రికా లోని ఇతర దేశాలలోని 40 మంది ఆ స్పూర్తిని వారి ప్రాంతాలలో చేపట్టారు.టాంజానియా,యుతోపియ, మాలవి,లిసోతో,యుగాండా, ఇతియోపియా దేశాల్లో ఈ ఉద్యమం మొదలయ్యింది.2000లో ఆమె జూబిలీ కోయలిషన్   ప్రారంభించి అందులో  ఆఫ్రికాలోని  పేద ప్రజలు తీర్చలేని బాకాయి రుణ మాఫీ, భూ కబ్జా, పెద్ద ఎత్తున అడవులను ఇతరత్రా అవసరాలకు వినియోగించే తీరుని  అరికట్టాలని ఉద్యమించింది. ఆమె కృషికి 2004  లోనోబెల్ బహుమతి పొందింది. అంతే కాక ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు ఆమెకు లభించాయి.

నేను చెప్పే బదులు ఆమె మాటల్ని మననం చేసుకుంటే బాగుంటుంది. ‘విద్యాభ్యాసం అంటే  ప్రజల్ని నేల నుండి దూరం చేసేది కాదు, వారికి భూమి పై ఇంకా మక్కువని పెంచేది.ఎందుకంటే చదువుకున్న వారికి మనం కోల్పోయింది ఏంటో ఇంకా ఎక్కువగా అర్ధం అవుతుంది. ఈ గ్రహం భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు , అందరం కలిసి దాన్ని రక్షించే ప్రయత్నం చెయ్యాలి. నేను  అటవీ శాఖ అధికారులతో , మహిళలతో   చెప్పినట్టు చెట్లు నాటడానికి డిగ్రీలు అవసరం లేదు.’

అవును చెట్లు నాటడానికి, ప్రకృతిని సంరక్షించడానికి పెద్ద చదువులు అవసరం లేదు, కొద్ది పాటి లోక జ్ఞానం, ప్రకృతి పైన ప్రేమ వుంటే చాలు, దురదృష్టం కొద్దీ అవే నేడు కనుమరుగవుతున్న గుణాలు.  ‘చిన్నప్పుడు ఆమె ప్రేమించిన  నదులు, వాగుల  స్పూర్తి వాక్కులు ఆమెకు జ్ఞాపకం వున్నాయి.’

 కాని ఎంత మంది పిల్లలకు ఈ అవాస్తవ ప్రపంచం లో నదులు, వాగులు, అడవులు, అంటే తెల్సు, వాట్ని నాశనం చేసిన వాడికి ఏమి తెల్సు ప్రకృతికి వారసత్వం లేకుండా చేస్తున్నాడని. ప్రకృతి లో ప్రతి జీవరాశికి తనకంటూ ఒక కధ, వారసత్వం  వుంటాయి, నేడు చెట్లను నరికి జాతీయ రహదారుల్లో  నిర్మాణం చేస్తుంటే అందులో కనిపించకుండా పోయేది కేవలం చెట్టే కాదు, ప్రకృతి వారసత్వం. అందుకే నేడు నదులకు . ప్రకృతిలోని జీవులకు జీవించే హక్కునిచ్చే చట్టాలు వస్తున్నాయి.

వీటి గురించి చెబుతూ ఆమె  ‘ప్రకృతిలోని అంతర్లీన సంబంధాలు అంటే ఆఫ్రికాలోని మూడు కాళ్ళ కుర్చీ గురించి ప్రస్తావిస్తుంది.  ముడుకాళ్ళ పైన వున్న పీట, ఒక్కో కాలు సమాజంలోని ఒక్కో స్తూపానికి  ప్రతీక. మొదటిది ప్రజాస్వామ్యానికి, అందులో మానవ  హక్కులకు, మహిళలకు, పిల్లలకు,  ప్రకృతికి స్ధానం. రెండవది సుస్థిరమైన ,సమానమైన వనరుల నిర్వహణ, యాజమాన్యం . మూడవది సమాజం, దేశం లోని  శాంతి, సంస్కృతి, సౌభ్రాత్రుత్వం. ఈ మూడింటిలో  ఏది లేక పోయినా రాజ్య వ్యవస్ధ నిలకడగా వుండదు, అభివృద్ధి జరగదు, అశాంతి ,సంఘర్షణలు చోటుచేసుకుంటాయి.

 అవును ఈ మూడూ కావాలి ,కాని కుర్చీల కోసమే జరిగే పోరాటాల కాలంలో వున్నాం. ‘కిస్సా కుర్సీ కా’ వీటి ఇసాబ్ కితాబులన్నీ అన్ని కాగితాలలో కనిపించవు.

‘మానవ హక్కులు, లేక పర్యావరణ హక్కులు అన్నవి ఏదో టేబుళ్ళ మీద పెట్టి చేర్చించి చేతులు దులుపు కోవడం కాదు. నేడు మనం వున్నది ఒక క్లిష్టమైన పరిస్దితులలో, దీనిని అధిగమించాలంటే మన ఆలోచనా ధోరణి మారాలి , అప్పుడు జీవనాధారమైన ప్రకృతిని సంరక్షిస్తాం.మన భూమికి కల్గిన గాయాలకు  సుశ్రూష చేస్తున్నామంటే అది మనకి కూడా అని అర్ధం కావాలి. అది వైవిధ్య భరితమైన అందమైన ప్రకృతిని ఆలింగనం చేస్కోవడం. నేడు సుస్ధిర అభివృద్ధి ,ప్రజాస్వామ్య౦ ,శాంతి అన్నవి విడదీయరానివి  ఇది సూక్ష్మ అవగాహన కాలం.’

ఇవి కెన్యా చెట్లమ్మ తల్లి  పలికిన నేల పలుకులు ...

ఇప్పుడు వినే వాళ్ళు,

రేపటికి అందించండి-

 

0 comments:

Post a Comment