Tuesday, 25 November 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-నేలకు పచ్చని పదాలను అల్లిన కవి-విల్లియం వర్డ్స్ వర్త్-11

18,19 వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వల్ల ప్రకృతి రూపు రేఖలు మారిపోయాయి.బొగ్గు గనులు,మిల్లులు, రైల్ మార్గాలు,ఓడ రేవుల పుణ్యమా అని ఇంగ్లాండ్ ప్రపంచంలో ఆర్ధిక శక్తి గా ఎదిగింది. పారిశ్రామీకరణ వల్ల 1801 నుండి 1901వరకు జరిగిన మార్పుల్లో ప్రధానమైనది నగరీకరణ.ఈ కాలంలో 20 శాతం నుండి 80 శాతం వరకు ఇంగ్లాండ్లో నగరవాసులయ్యారు. గ్రామాల సామాజిక స్వరుపాలు మారాయి. ఇంగ్లాండు పారిశ్రామీకరణకు పుట్టినిల్లు అయ్యింది,దానికి వ్యతిరేకత ఏర్పడింది.
ఈ వ్యతిరేకత ఆంగ్ల సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా విల్లియం వర్డ్స్ వర్త్ కవితల్లో(1770-1850).ఆయన కవితల్లో ప్రకృతి పురి విప్పుకుంటుంది. అయన తన జీవిత కాలంలో ఇంగ్లాండులో 175000 మైళ్ళు నడిచాడు. సాహిత్య చరిత్ర కారుడు జోనాథన్ బెట్ మాటల్లో ఆయన తన పాటకులకి ప్రకృతితో నడవడం నేర్పాడుఅంటాడు. 
పారిశ్రామీకరణ, నగరీకరణ వల్ల, ప్రకృతి విధ్వసం వల్ల సామాన్య ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చలేకపోతున్నారు అన్నాడు.నేలను పచ్చగా అల్లలేకపోతున్నారు అనీ చెప్పాడు. గ్రామీణ ప్రజలకు అక్షర జ్ఞానం లేకపోయినా ప్రకృతి తో మమేకమయే గుణం వుంది అన్నాడు. ప్రకృతితో మమేకమై జీవించడం చెప్పిన కవి వర్డ్స్ వర్త్.
తటాకాలున్న నేలతో అనుబంధం వున్న వ్యక్తి ఆయన.ఆయన చెరువులు గురించి రాసిన పుస్తకం ఇప్పుడు ఎవరికీ తెలియదు,కాని అప్పట్లో బాగా అమ్ముడుపోయిన పుస్తకం అది. ఆయన కవితా సంపుతులకంటే ఎక్కువ ఆర్ధిక సంపాదనని ఇచ్చిన పుస్తకం అదే.
ఆయన మాటల్లో ప్రకృతి సంరక్షణ అంటే అది ప్రణాళిక బద్దంగా జరగాలి, కొల్లకొట్టుకోవడానికి కాదు
ఆయన కవిత్వ తాత్వికతలో రైతులు,పశువుల కాపర్లు ప్రకృతితో మమేకమైన జీవనం ఒట్టిపడుతుంది.
ఎవరినుద్దేసించి---
పచ్చటి లోయలు ,వాగులు,గుట్టలు
పశువుల కాపర్ల ఆలోచనలు వేరు
పొలాలు, వాళ్ళ పసిడి నవ్వుల్లో ఆలోచనల్లో వాళ్ళు శ్వాసించారు
ఉమ్మడి గాలి, కొండలు నుండి అతను ఊపిరి పొందాడు
క్లిష్టతరమైన మెట్లను ఎక్కి ,ఇష్టంగా
ఎన్నో సంఘటనలు అతని మదిలో
కష్టాలు, నైపుణ్యం,ఆత్మ నిబ్బరం, సంతోషం లేక భయం;
ఓ పుస్తకంలా జ్ఞాపకాల్ని భద్రపర్చుకున్నాయి
మొద్దు పశువులు,అతను కాపాడినవి
అతను పోషించినవి, పెంచుకున్నవి
ఈ పొలాలు, ఈ కొండలు
అవి ఆయన సహచరులు,అంతకంటే ఎక్కువ
అతని రక్తం కంటే ఎక్కువ- అంత కంటె తక్కువేం కాదు? అవి అతని
భావనల్లో ఒక భాగం,అంతే
ఓ మమైక ఆరాధ్య భావన
జీవితంలోని ఆనందం ఒక అనుభూతుల భావం తప్ప ఇంకేమిలేదు . 
(
అనుసృజన)
ఓ దేశం తన ప్రాంతాన్ని అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అంటే ,ఆ ప్రాంతం తన స్వారుప్య రూపాన్ని మార్చుకోకుండా,గ్రామీణ స్వారుప్యాన్ని ఉంచుకుంటూ,ఒక ప్రత్యేకమయిన చరిత్రని , గాలిలో అనే చరిత్రలో తన వునికిని కాపాడుకుంటూ,దానికంటూ చరిత్రలో ఓ గుర్తుగా వుండాలి.
ఆయన తన ప్రాంతంలో రైల్ మార్గం వల్ల చెరువులు పాడైపోతాయని దానికి వ్యతిరేకపోరాటం చేశాడు.


Tuesday, 18 November 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-అడవి పాట చికొమెండిస్‌-10

పర్యావరణ ఉద్యమాల ద్వారా పర్యావరణ స్పృహ ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తి చెందింది. దీనికి ముఖ్య కారణం, 1960 కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వనరులు దోపిడికి గురవ్వడం. ఈ తీరుని వ్యతిరేకిస్తూ స్థానికులు చేసిన తిరుగు బాటు. అందులోది అమెజాన్ లో చికొమెండిస్‌ చేపట్టిన ఉద్యమం కీలక పాత్ర వహించింది.అతని మాటల్లో ఉద్యమానికి నిర్వచనం-మొదట్లో నేను రబ్బర్ చెట్లను కాపాడడానికి పోరాడుతున్నాననుకున్నాను, తర్వాత అమెజాన్ సతత హరిత అడవుల్ని కాపాడడానికి పోరాడుతున్నాననుకున్నాను, ఇప్పుడు నాకు అర్ధమైంది నేను మానవాళికై పోరాడుతున్నానని.
చికో మెండిస్  చేపట్టిన  ఉద్యమంపై మనోఎల్ శాంతా మారియా కవిత అమెజాన్ లోని ప్రజల గోడును వివరిస్తుంది.
 ఇప్పడు ఇండియన్స్ సహాయం కోసం అర్ధిస్తున్నారు
అట్లాంటిక్ సతత హరిత అడవులు కన్నీళ్ళు రాలుస్తున్నాయి
 ఇప్పుడు అమెజాన్ అక్కడి మృతుల గురించి వ్యధ చెందుతోంది
దుర్గంధమైన గాలి వీస్తోంది
మమ్మల్నందర్ని ఉక్కిరిబిక్కిరి చేసి భయబ్రాంతులకి గురిచేస్తోంది.
(అనుసృజన)
పర్యావరణ ఉద్యమాలకి అంతం వుండదు. నిరంతరం ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతూనే వుంటాయి.డబ్బు, పలుకుబడి, రాజకీయం, సాంకేతిక పరిజ్ఞానం, ఈ దోపిడిని పెంచుతోందే తప్ప తగ్గించడం లేదు. చాలా మటుకు పర్యావరణ ఉద్యమాలు అహింసా పద్ధతులే అనుసరిస్తాయి. ఆ ఉద్యమకారులు మనల్ని వదిలి పోయిన తీరు ,మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే వుంటుంది.
చికో మెండిస్
ఆతను ఈ గ్రహానికి కరుణని పంచాడు
ఇప్పడు ఓ ఆకులా రాలి పోయాడు
అతనికి ఇష్టమైన సతహరిత అడవుల్లో, నమ్మశక్యం కావడం లేదు
అమెజాన్ వీరుడు నిష్క్రమించాడంటే.
(కెన్ని జే బెజ్)

(అనుసృజన)
Tuesday, 11 November 2014 0 comments By: satyasrinivasg

పర్యావరణ ఉద్యమాలు-అడవి పాట చికొమెండిస్‌


ఈ స్వరాన్ని డిసెంబరు 22,1988 ఉదయాన ఆయన ఇంటి వద్దే నలిపివేశారు. అప్పటికే ఆ ఏడాది 89 గ్రామీణ కార్యకర్తలను హత్య చేశారు. చికొమెండిస్‌ తొంబయ్యోవాడు. భార్య ఇల్‌నమాన్‌ జి. బేజేర్‌వా, నాలుగేళ్ల కూతురు, రెండు సంవత్స రాల కొడుకు చూస్తుండగానే ఇంటి ముందే హత్య చేశారు. నలభైనాలుగు వసంతాల వృక్షాన్ని అర్థాంతరంగా నరికేశారు. భూమిలో చొచ్చుకుపోయిన వేళ్ళు, ఆకాశంలో విర బూసిన పూలు. సర్వత్రా వ్యాపించే పరిమళం. గాలితో కబురంపే లేత ఆకుల పచ్చదనం. ప్రతి ఒక్కరి పిడికిలిలో గూళ్ళు కట్టిన పక్షులను, వాళ్ళు ఎప్పటికీ హరించలేరు.
డిశంబరు 15, 1945న షావురి (ఏకర్‌) బ్రెజిల్‌లో జన్మించిన చికోమెండిస్‌ చిన్నప్పటినుండి రబ్బర్‌ ట్యాషర్‌గా శిక్షణ పొందాడు. అడవిలో జన్మించిన కారణంగా తన చుట్టూ వున్న వాటని తనదిగా అర్థం చేసుకోగలిగాడు. రబ్బర్‌ ట్యాషర్స్‌ అను భవిస్తున్న కష్టాలను ఆరికట్టడానికి 1970లో ఏర్పడిన షాపురి రూరల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యకక్షుడిగా పనిచేశాడు. అసలే అప్పుల వలయంలో చిక్కుకుపోయిన రబ్బర్‌ ట్యాషర్స్‌ పరిస్థితులను 1960-70లలో సంభవించిన మార్పులు దిగజార్చాయి. దక్షిణ బ్రెజిల్‌ నుండి వచ్చిన వాణిజ్య వర్తకులు రబ్బర్‌ ఎస్టేట్స్‌ కొనుక్కుని, ఆ ప్రదేశాలకు పచ్చిక భూములుగా మార్చారు. దీని కారణంగా నిరాశ్రయులైన రబ్బర్‌ ట్యాసర్స్‌ అడవుల లోపలికి వెళ్ళి బ్రతకవలసి పరిస్థితి ఏర్పడింది. స్థానిక షావుకార్ల చేతుల్లో మోసపోవడం, అప్పుల వలయంలో చిక్కుకుపొవడం, బయటవారి ఆక్రమణలకు గురవ్వడం...వారి ఇంట్లోనే వాళ్ళు అజ్ఞాతులుగా జీవించే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులకు ఎదురుతిరిగి తమ హక్కుల కోసం పోరాడటానకి 1970లో షావురి రూరల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏర్ప డింది. అడవులను నరికివేయడానికి వచ్చిన ఇతర ప్రాంత కూలీలను ఆ పని చేయకుండా అడ్డుకోవడం, సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టడం, ఏకాభిప్రాయంగల విద్యావేత్తలు, సంస్థల నుండి సహాయాన్ని కోరడం తద్వారా వాటిని కో-ఆపరేటివ్స్‌, పాఠశాలలు ఆరోగ్య సదుపాయాల కొరకు వినియోగించడం యూనియన్‌ పని ఫలితం గా వారి ఆర్థిక జీవనంలో ఆశాజనకమైన మార్పు కన్పించింది.
ఏ ఉద్యమమైనా రాజకీయ అధికార మార్పుని ఆశిస్తుంది. ఈ మార్పు అధికార వికేంద్రీకరణకు నాంది గీతం ఆలపిస్తుంది. అదే అలాసన్‌-చికోమెండిస్‌. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి సమతుల్యత అన్న పేరుతో వాటికి పూర్తిగా విభిన్నంగా ఉన్న కార్యక్రమా లను బ్రెజిల్‌ ఆమోజాన్‌ అడవులలో అమలు చేయటంవల్ల అక్కడ స్థానికుల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ఫలితం వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ బ్రెజిల్‌ ప్రపంచంలో అత్యధికంగా అప్పులున్న దేశాల జాబితాలో చేరుకుంది. వాణిజ్యపరంగా ఎంత సంపాదిం చిన్పటికీ అదంతా అప్పులు తీర్చడంలోనే ఖర్చు అవుతుంది. త్వరత్వరంగా అప్పుల వలయంలో నుంచి బయట పడడానికి త్వర త్వరగా వనరులను వినియోగించాల్సి వస్తుం ది. ఇందుకై స్థానిక భూమి వినియోగ పద్దతు లు మారాయి. చెట్లునరికి వాటి స్థానంలో ఆదాయం కోసం మార్కెట్‌ పంటలు వేశారు.
కాఫీ, నూనె వచ్చే కూరగాయలు వంటివి అడవిలోకి చోచ్చుకు వాచ్చాయి. ఈ తోటలలో స్థానికులు కూలీలుగా పని చేయ్యాల్సిన దుస్థితి వస్తుంది. వీటిని కొనుక్కునే దేశాలు తిరిగి వీళ్ళకి (దేశాలకి) అప్పులు ఇస్తారు. అసలుకంటే వడ్డీ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు 1983-89 కాలంలో ల్యాటిన్‌ అమెరికన్‌, క్యారిబియన్‌ దేశాలవాళ్ళు తీసుకున్న అప్పుకంటే 90 బిలియన్‌ యు.ఎస్‌ డాలర్స్‌ ఎక్కువగా కట్టారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి, ఒక అడవికి, ఒక ఈ గిరిజను డికి సంబంధించిన సమస్య కాదు. ఏ అడవిని చూసినా ఇదే కనబడు తుంది. అడవులను కాపాడడమంటే కేవలం వృక్షాలను, పకక్షులను కాపాడుడం కాదు. అడవులతో సహజీవనం సాగిస్తున్న జన సాంప్రదాయాన్ని కాపాడడం.
పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రబ్బర్‌ వినియోగం పెరిగింది. ఒక కాలంలో పంచులకీ, పాదకులకీ వినియోగించబడ్డ రబ్బర్‌ 18వ శతాబ్దంలో ఐరోపాలో సర్జికల్‌, వాటర్‌ ప్రూఫ్‌ క్లాత్‌ కొరకు వినియోగించ బడినది. 19వ శతాబ్దంలో టైర్‌ల వినియోగం కోసం వాడుకలోకి వచ్చింది. దీని కారణంగా బయటవారు ఇక్కడికి వచ్చి స్థిరపడడం ప్రారంభించారు. వాణిజ్యవ్యాపారం పెరుగుతున్న కొద్దీ స్థానికులకు ఇబ్బందులు అధికమయ్యాయి. తమ వనరులపై తమకు ఏ విధమైన అధికారం లేకపోవడం, లాభాలు అందకపోవడం, మారుతున్న భూమి వినియోగం, అడవుల క్షీణత స్థానికుల జీవనాన్ని క్షీణింప జేశాయి. 
స్థానిక ప్రజలకు ఎటువంటి కనీస సదుపాయాలు లేవు. ఇటువంటి వాతావరణంలో పెరిగిన చికోమెండిస్‌ అక్కడి ప్రజలను సమైక్యపర్చి వారి హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఉద్యమాన్ని స్థానికంగా బలపరుస్తూ, అదే సమయంలో ఇతర సంస్థలతో వ్యక్తు లతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేపట్టాడు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ వంటి సంస్థలలో సభ్యత్వం పొంది వాటి ద్వారా ఉద్యమాన్ని మందుకు నడిపాడు. చికోమెండిస్‌ ప్రయత్నాలను గుర్తించి 1987లో అతనికి యు.ఎన్‌ వారు గ్లోబల్‌ 500 బహుమతి ఇచ్చారు. న్యూయార్కు కు చెందిన బెటర్‌ వరల్డ్‌ సంస్థ అతనికి పతకాన్ని బహూ కరించింది.1980లో రిమోడి జెవారియె చికోమెండిస్‌ను గౌరవ పౌరుడిగా ప్రకటించింది. జీవితపు తొలి పుటలలో నేర్చు కున్న పాఠాలు జీవితాన్ని మలుస్తాయి. బాల్యం అడవిలో గడిపాడు. అక్షరాలకు బడులు రబ్బర్‌ సేకరించడం అతని పాఠశాల. చదువుకో వడం వల్ల పిల్లలు తెలివిమీరి తిరగబడతారని యజమానులు పిల్లలను చదువుకోనియ్యకుండా చేసేవారు. అందరిలా చికోమెండిస్‌ కూడా ఓ బానిస '' 1982 సంవత్సరం ఓ మధ్యాహ్నం పూట మాఇంటి పక్క నుండి ఓ అజ్ఞాత వ్యక్తి వెళ్ళేడు. అతనిని నేను ఎప్పుడూ చూడ లేదు. అతని వేషధారణ చూస్తే ఇక్కడి వాడు కాదు. అప్పుప్పు డు వచ్చి మాతో మాట్లాడేవాడు. అతని చేతిలో ఓ పత్రిక. అది ఏమిటో నాకు అసలు తెలియదు. కాని దాని ద్వారానే నేను
చదువు నేర్చుకున్నది. ఒక రోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పటి నుండి తరచు అక్కడికీ వెళ్ళడం,చదువు నేర్చుకోవడం మొదల య్యింది. అనేక రాత్రులు ఆయన చెప్పింది వినేవాడిని. ఒక ఏడాది పరిచయం పిమ్మట ఆయన ఎవరో తెలిసింది. అతను సైన్యంలో పనిచేశాడు. అతని సహచరులతో కలసి తిరుగుబాటు ఉద్యమాలు నడిపాడు. ప్రెస్‌ట్సి కొరకు ఉద్యమం సాగించాడు. పట్టుబడ్డాడు. పారిపోయాడు. 1950లలో బొలిలీయన్‌ కార్మికుల కోసం పోరాడాడు. మైనింగ్‌ కార్మికుల కోసం అక్కడి సైనిక ఒత్తిడివల్ల బ్రెజిల్‌ అడవులలోకి వచ్చి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన గురువు వద్ద నేర్చు కున్న పాఠాలు చికోమెండిస్‌ను ఒక మంచి ఆర్గనైజర్‌గా తీర్చితిద్దాయి. ఉద్యమాన్ని బలపర్చడానికి చికోమెండిస్‌ వివిధ సంస్థలలో, వివిధ స్థాయిలలో పనిచేశాడు. 1968లో రబ్బర్‌ట్యాషర్స్‌ని ఆర్గనైజ్‌ చేయడంలో చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. 1975లో బ్రెజిల్‌ యూనియన్‌లో సభ్యుత్వం, 1978 ప్రాంతంలో షావురి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలలో పోటీచేసి గెలిచినప్పటికీ, తను అనుకున్నంత స్థాయిలో రబ్బర్‌ ట్యాషర్స్‌ గూర్చి ఏమీ చేయలేకపోయాడు. ప్రస్తుతం ఉన్న యూనియన్లతో రబ్బర్‌ ట్యాషర్స్‌ సమస్యలు పరిష్కారం కావని కూడా గ్రహించాడు. ఈ తరుణంలోనే (1978) వర్కర్స్‌ పార్టీ ఆవిర్భవించింది. వర్కర్స్‌ పార్టీ పెరిగిన తీరు, అవలంబించిన పద్దతులు చికో ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ పార్టీలో సభ్యుడుగా చేరాడు. 1982 వరకు పార్టీలో ముమ్మరంగా పనిచేసి ఆ తర్వాత షావురి రూరల్‌ వర్కర్స్‌ యూనియన్‌కి పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇప్పటివరకు వారు చేపట్టిన ఉద్యమం రబ్బర్‌ ట్యాసర్స్‌ జీవితాలలో ఆశాజనకమైన మార్పులు కల్పించింది.ఉద్యమం పుణ్యమా అని 200,000 హెక్టార్ల అడివిని రక్షించ గలిగారు. కో-ఆపరేటివ్స్‌ స్థాపించారు. దాని ద్వారా రబ్బర్‌ ట్యాసర్స్‌కు కావలసిన కనీస సదుపాయాలు ఏర్పాడుతు న్నాయి. కొన్ని ముఖ్యమైన రబ్బర్‌ ఎస్టేట్స్‌ ప్రాంతాల్ని రిజర్వుగా ప్రకటించి సురక్షత ప్రాంతాలుగా సంరక్షించ గల్గుతున్నారు.
ఇన్ని వైవిధ్యాలు గల ఉద్యమం ప్రపంచంలో చాలా అరుదుగా కనబడు తుంది. అందులోను బ్రెజిల్‌లోని షావురి ఉద్యమం బహుశా మొదటిది. ఇప్పటికీ పర్యావరణ ఉద్యమాలను కేవలం పచ్చజెండాలుగానే అర్థం చేసుకుంటాం. చికోమెండిస్‌ పోరాడినది రబ్బర్‌ మొక్కలు, రబ్బర్‌ ట్యాసర్స్‌ కోసమే కాదు. అతను మనిషికి పచ్చని మనస్సుని తొడిగాడు. చికో ఉద్యమానికి చెప్పిన నిర్వచనం తలుచుకుంటే ఉద్యమం అనేది ఎందుకు చేపట్టాలో స్పష్టంగా తెలుస్తుంది. అతనికి తనని ఏలాగూ చంపుతారని తెలుసు. అయినా పనిచేయడం కొనసాగించాడు. ఆయన చనిపోయే ముందు రాసిన ఉత్తరంలో '' నాకు తెలుసు, నన్ను చంపేస్తారని. నేను చచ్చిపోయిన తర్వాత నాశరీరంపై పెట్టిన పుష్ప గుచ్చాలు ఏ అడవి చేట్టు నుండి వచ్చాయో నాకు తెలుసు. నేను వాటి కోసం చావడం లేదు. ఈ ఉద్యమం చేపట్టింది చావడానికి కాదు. బ్రతకడానికి''.....
ఆమోజాన్‌లో అడివిని తీసి పచ్చిక బైళ్ళుగా మార్చినా, మన ప్రాంతాలలోని పాడేరులో మైనింగ్‌ చెపట్టినా ఎంతమంది బ్రతుకుతున్నారన్నది ముఖ్యం. ఎవరు బ్రతుకుతున్నారనేది ముఖ్యం. మూల వాసులు తమ బతుకు తీరుని సరిదిద్దుకో గల సత్తా గలవారు. వారిని ఎవరూ ఉద్దరించనవసరం లేదు. వారిని అర్థం చేసుకుని వారికి తోడుగా వుంటే చాలు. చికోమెండిస్‌ చేసిన ప్రయత్నమిదే. అడవిపాట ఆలాపనకి అంతముండదు. అడవిపాట స్పర్శ వేరు. దాని రంగు, వాసనే వేరు...
ఎర్రని రక్తపు రంగునుంచి వచ్చిన 
పచ్చటి అరటి గెలా
ఎరుపచ్చని చీర కట్టి
నదికాడ తానమాడుతున్న
తీయన్ని విరహ వేదనా.
(
ఒరిస్సా ప్రాంతం గిరిజనుల పాట)
వీటికి మనం భాష్యాలు చెప్పద్దు...అర్థం చేసుకుంటే చాలు.


Top of Form
Bottom of Form


Saturday, 1 November 2014 0 comments By: satyasrinivasg

వూరడవోళ్ళం -మూల వాసుల జీవన వలయం -7

  

అభయారణ్యాలు
జాతియపార్కులు
వూరికి
అడవికి
మధ్య సరిహద్దు గోడలు
అడవి చెట్టు
ఇంటికి దూలమైన
నాగలి గింజ

అడవి నేల
మా ఇంట్లో
పుట్టమన్ను పొయ్యి

అడవి జంతువులు
కాడెద్దుల
బండి చక్రపు చూపులు

అడవి గాలి
మా చేనమ్మటే తిరిగే
నిశాచరి
పందికూన
అడవి నీరు
మా యేటి గట్టు
నేల నక్షత్రాల
నిద్రహారాల పక్షి గూళ్ళు
రేలా..రేలా...
మోదుగ
పాల పూల
అద్దాల వూరడవి భాష

గోడకి
ఆవలి ఇవలి గాళ్ళం
వూరడవోళ్ళం
( అభయారణ్యాలు,జాతీయ పార్కుల భాదితులకు,)
(తలకోన,తురక పల్లి,నెరబైలు-6.3.2000)

ఒక కవిత ఎలా పుడుతుందో కచ్చితంగా చెప్పలేను. కాని నాకు మటుకు సంచరిస్తునప్పుడు దానంతట అదే ఊబికి  వస్తుంది. ఇది  అంతర్లిన(intra space),బాహ్య(inter space) మధ్య సంభాషణ,ఒక పర్యావరణ రోదసి సవ్వడి.
 పై కవితని నేను తలకోన,తురక పల్లి లో తిరుగుతూ అక్కడి వాళ్లతో మాట్లాడుతున్నపుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఈ విధంగా చెప్పుకున్నా. 2000లో ఇది అభయారణ్యం, మీరు ఇక్కడి నుండి వెళ్ళి పోవాలి అన్న కుబురు తెలిసింది వాళ్ళకి. ఆ విషయం తెలిసి అక్కడికి సహచరులతో కలిసి వెళ్ళా, మరి ఇంత జరుగుతున్నా వారి మాటల్లో తిరుగుబాటు తనం కన్పించలేదు .అది ఎందుకంటే,ఈ వూరడవొళ్ళ బాధ ఇప్పటిది కాదు. ఎప్పటి నుండో అడవిలోని కొంత ప్రాంతాన్ని పాలకులు వేట కోసం వినియోగింజు కుంటు వచ్చారు. ఎప్పుడు సరికొత్త నియమాలే .పూర్వం అడవికి భౌతికంగా సరిహద్దులు లేవు. వాళ్ళని వెళ్ళి పొమ్మని ఎవరు చెప్పలేదు,
కధ-1
బ్రిటిష్ కాలంలో 1865 ప్రాంతంలో అడవి భూమికి సరిహదులు ప్రకటించుకుని అటవీ శాఖని ఏర్పాటు చేసారు.అప్పటి నుండి ఇప్పటివరకు అటవీ శాఖకి,రెవెన్యు శాఖకి తగాదాలు తెమలడం లేదు.అటవీ చట్టాలు ఏర్పడ్డాయి. అడవుల్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.రిజర్వు ,గ్రామ అడవి వగైరా. రిజర్వు అడవి లో కొన్ని నిభందనులు పాటించి తిరగాలి. 1972 లో మన దేశంలో వన్య ప్రాణి చట్టం వచ్చింది ,అప్పుడు ఈ రిజర్వు అడవి లోని  కొంత ప్రాంతాన్ని వన్య ప్రాణి శాఖకు అభయారణ్యాలు,జాతీయ పార్కుల కోసం అప్పగించారు. కాని అప్పటి నుండి 2000 వరుకు ఆ ప్రాంతాన్ని చట్ట పరంగా బదలాయింపు జరగలేదు.,ఇది వెంటనే చేపట్టాలని  2000లో ఉత్తరువులు జారి అయ్యాయి. అందు కోసం వన్య ప్రాణి ప్రాంతాలన్నిటికీ కబురు వచ్చింది.తెలంగాణా ,ఆంధ్రా లో ఇటువంటివి  సుమారు 23 ప్రాంతాలున్నాయి. అందులో తలకోన ఒకటి.
 కాల క్రమంలో  అడవి  వర్గీకరణ వాళ్ళలో  ఒక అంతర్లిన,బాహ్య స్థితిని వర్గికరిస్తుంది.,అప్పుడు జీవనం లో భాగమైన అడవి వ్యక్తీ,కుటుంబ ,సమాజ మానసిక స్పేస్ లో  ఒత్తిడి గురిచేసే చట్రం అవుతుంది. ఈ చట్రాన్ని చేదించడమంటే ,కేవలం అడవినే అంశం గా తీసుకుని చేసే తిరుగు బాటు కాదు. అన్నీ వ్యవస్థలో తో చేసే సిద్దాంత పోరాటం .దానికి ఆది అంతం ఎక్కడ!
మరి అదే తలకోనలో పర్యాటకులు,సినిమా వాళ్ళు వినోదానికి వస్తారు. వారికి,అడవి అందంగా కనిపించే విలాస,వినోద  రూపం మాత్రమె. ఇలాంటి పర్యాటకులు వస్తు పోతున్తూనే వుంటారు ,
కధ-2
అదే కాలంలో మహారాష్ట్ర లోని బులదానాలో ఇదే సమస్య గురించి గ్రామస్తులతో చర్చిస్తునప్పుడు  ఒక ముసలి అంధుడు బాధతో అన్నాడు నేను పుట్టి గుడ్డి వాడ్ని,ఇక్కడే పుట్టి ,పెరిగాను,ఎప్పుడు పులి నన్ను ,ఏమిచేయలేదు,ఇప్పుడు నన్ను ,నా గ్రామం నుండి వెళ్ళి పొమ్మంటే ఎక్కడికి పోను.
వియర్ ఎల్విన్ తన ఆత్మ కధలో పాండా బాబా గురించి చెపుతూ, పాండా బాబా(గోండు) కొన్ని వూళ్ళకి పూజారి, ఆయనకీ వైద్యం తెలుసు,ఒక సారి ఆయన నా దగ్గరికి కుందేళ్ళ పెంటికలకోసం వచ్చాడు, ఎందుకు అని అడిగాను ,ఇప్పుడే ఒక పసికనుకి అది రాస్తే వాడు ,కుందేలు లా చెంగు,చెంగున పరిగేడుతాడు,ఇప్పటి రాతి యుగం (ఆధునిక కాలం) ఇది నమ్మరు ,కాని నేను నమ్ముతాను. అన్నాడు.
అవును అయన మాటలో అర్ధం నాకు 1997 విజయనగరంలోని పాచిపెంట మండలంలోని సరుగుడు వలసలో ఒకసారి వాళ్ళని పాట పాడ మంటే ఎవరు పాట రాదు, పాడ లేదు. చివరికి ఒక ముసలమే,అంధురాలు లో.... అంటూ పాట మొదలుపెట్టింది , లోల్లోలోరేలోల్లె దానికి అందరు జత కట్టారు. నా మటుకు బీతొవెన్ మూన్ లైట్ సొనాట,ఓ వెన్నెల ఆమె నేత్రాల్లో బంది అయ్యి ఆమె గళం ద్వారా అందరిని జతకట్టించింది. అందరు పాతనల్లె వాళ్ళే. అవును మనది రాతి యుగం ,మనం కేవలం సృజనాత్మక కోల్పోతున్న శ్రోతలం. అడవి వినోదం కోసం చూసే పర్యాటకులం,అక్కడి జీవితలాన్ని ఇకో టూరిజం పెర్న వాళ్ళ గడప  ఎదుటే వాళ్ళు నృత్యం చేస్తుంటే  వినోదం చూసే వాళ్ళం.
కధ-3
వాళ్ళ పరిస్ధితి చూస్తుంటే నాకు హైకూ లు కనపడతాయి.
మా వూరిలోనే
నేనిప్పుడు ప్రయాణికుడిలా
పడుకుంటాను
-క్యొరాయి
(అనువాదం-గాలి నాసరెడ్డి)
హైకూ లు చాలా అందంగా కనపడ తాయి కాని వాటి  స్టేట్ అఫ్ మైండ్, నిరాడంబరత,ఒంటరితనం,పరిపూర్ణంగా అంగీకరించడం,ప్రపంచానికి అతీతంగా వుండడం, మేధావితనం లేకపోవడం,విరుద్ధత లేకపోవడం,హాస్యం,స్వేచ్చ,సదాచారం కొరవడడం, ,అభౌతికత,ప్రేమ, దైర్యం.(ఆర్.హెచ్.బ్లిత్).ఇవన్నీ లక్షానులన్నప్పుడు  పర్యావరణియం కల్మషం లేకుండా వుంటుంది. ఇప్పుడు అంతరించిపోతున్నది మనలో ఆ వూరడవొళ్ళ హైకూ చూపు.ల హారం.
ఎంత త్వరగా మరనిస్తుందో
ఎలాంటి  సూచనా లేదు
కీచురాయి అరుపులో
-బషో
(అనువాదం-గాలి నాసరెడ్డి)