అభయారణ్యాలు
జాతియపార్కులు
వూరికి
అడవికి
మధ్య సరిహద్దు గోడలు
అడవి చెట్టు
ఇంటికి దూలమైన
నాగలి గింజ
అడవి నేల
మా ఇంట్లో
పుట్టమన్ను పొయ్యి
అడవి జంతువులు
కాడెద్దుల
బండి చక్రపు చూపులు
అడవి గాలి
మా చేనమ్మటే తిరిగే
నిశాచరి
పందికూన
అడవి నీరు
మా యేటి గట్టు
నేల నక్షత్రాల
నిద్రహారాల పక్షి
గూళ్ళు
రేలా..రేలా...
మోదుగ
పాల పూల
అద్దాల వూరడవి భాష
గోడకి
ఆవలి ఇవలి గాళ్ళం
వూరడవోళ్ళం
(
అభయారణ్యాలు,జాతీయ పార్కుల భాదితులకు,)
(తలకోన,తురక
పల్లి,నెరబైలు-6.3.2000)
ఒక కవిత ఎలా
పుడుతుందో కచ్చితంగా చెప్పలేను. కాని నాకు మటుకు సంచరిస్తునప్పుడు దానంతట అదే
ఊబికి వస్తుంది. ఇది అంతర్లిన(intra space),బాహ్య(inter space) మధ్య సంభాషణ,ఒక పర్యావరణ రోదసి సవ్వడి.
పై కవితని నేను తలకోన,తురక పల్లి లో తిరుగుతూ
అక్కడి వాళ్లతో మాట్లాడుతున్నపుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఈ విధంగా చెప్పుకున్నా. 2000లో
ఇది అభయారణ్యం, మీరు ఇక్కడి నుండి వెళ్ళి పోవాలి అన్న కుబురు తెలిసింది వాళ్ళకి. ఆ
విషయం తెలిసి అక్కడికి సహచరులతో కలిసి వెళ్ళా, మరి ఇంత జరుగుతున్నా వారి మాటల్లో
తిరుగుబాటు తనం కన్పించలేదు .అది ఎందుకంటే,ఈ వూరడవొళ్ళ బాధ ఇప్పటిది కాదు. ఎప్పటి
నుండో అడవిలోని కొంత ప్రాంతాన్ని పాలకులు వేట కోసం వినియోగింజు కుంటు వచ్చారు. ఎప్పుడు
సరికొత్త నియమాలే .పూర్వం అడవికి భౌతికంగా సరిహద్దులు లేవు. వాళ్ళని వెళ్ళి
పొమ్మని ఎవరు చెప్పలేదు,
కధ-1
బ్రిటిష్ కాలంలో 1865 ప్రాంతంలో అడవి భూమికి సరిహదులు ప్రకటించుకుని అటవీ శాఖని ఏర్పాటు చేసారు.అప్పటి
నుండి ఇప్పటివరకు అటవీ శాఖకి,రెవెన్యు శాఖకి తగాదాలు తెమలడం లేదు.అటవీ చట్టాలు
ఏర్పడ్డాయి. అడవుల్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.రిజర్వు ,గ్రామ అడవి వగైరా. రిజర్వు
అడవి లో కొన్ని నిభందనులు పాటించి తిరగాలి. 1972 లో మన దేశంలో వన్య
ప్రాణి చట్టం వచ్చింది ,అప్పుడు ఈ రిజర్వు అడవి లోని కొంత ప్రాంతాన్ని వన్య ప్రాణి శాఖకు
అభయారణ్యాలు,జాతీయ పార్కుల కోసం అప్పగించారు. కాని అప్పటి నుండి 2000 వరుకు ఆ
ప్రాంతాన్ని చట్ట పరంగా బదలాయింపు జరగలేదు.,ఇది వెంటనే చేపట్టాలని 2000లో ఉత్తరువులు జారి అయ్యాయి. అందు కోసం
వన్య ప్రాణి ప్రాంతాలన్నిటికీ కబురు వచ్చింది.తెలంగాణా ,ఆంధ్రా లో ఇటువంటివి సుమారు 23 ప్రాంతాలున్నాయి. అందులో తలకోన ఒకటి.
కాల క్రమంలో
అడవి వర్గీకరణ వాళ్ళలో ఒక అంతర్లిన,బాహ్య స్థితిని వర్గికరిస్తుంది.,అప్పుడు
జీవనం లో భాగమైన అడవి వ్యక్తీ,కుటుంబ ,సమాజ మానసిక స్పేస్ లో ఒత్తిడి గురిచేసే చట్రం అవుతుంది. ఈ చట్రాన్ని
చేదించడమంటే ,కేవలం అడవినే అంశం గా తీసుకుని చేసే తిరుగు బాటు కాదు. అన్నీ
వ్యవస్థలో తో చేసే సిద్దాంత పోరాటం .దానికి ఆది అంతం ఎక్కడ!
మరి అదే తలకోనలో
పర్యాటకులు,సినిమా వాళ్ళు వినోదానికి వస్తారు. వారికి,అడవి అందంగా కనిపించే
విలాస,వినోద రూపం మాత్రమె. ఇలాంటి
పర్యాటకులు వస్తు పోతున్తూనే వుంటారు ,
కధ-2
అదే కాలంలో
మహారాష్ట్ర లోని బులదానాలో ఇదే సమస్య గురించి గ్రామస్తులతో చర్చిస్తునప్పుడు ఒక ముసలి అంధుడు బాధతో అన్నాడు ‘ నేను పుట్టి గుడ్డి వాడ్ని,ఇక్కడే పుట్టి
,పెరిగాను,ఎప్పుడు పులి నన్ను ,ఏమిచేయలేదు,ఇప్పుడు నన్ను ,నా గ్రామం నుండి వెళ్ళి
పొమ్మంటే ఎక్కడికి పోను”.
వియర్ ఎల్విన్ తన
ఆత్మ కధలో పాండా బాబా గురించి చెపుతూ, ‘పాండా బాబా(గోండు) కొన్ని వూళ్ళకి పూజారి, ఆయనకీ
వైద్యం తెలుసు,ఒక సారి ఆయన నా దగ్గరికి కుందేళ్ళ పెంటికలకోసం వచ్చాడు, ఎందుకు అని
అడిగాను ,ఇప్పుడే ఒక పసికనుకి అది రాస్తే వాడు ,కుందేలు లా చెంగు,చెంగున
పరిగేడుతాడు,ఇప్పటి రాతి యుగం (ఆధునిక కాలం) ఇది నమ్మరు ,కాని నేను నమ్ముతాను.” అన్నాడు.
అవును అయన మాటలో
అర్ధం నాకు 1997 విజయనగరంలోని పాచిపెంట మండలంలోని సరుగుడు వలసలో
ఒకసారి వాళ్ళని పాట పాడ మంటే ఎవరు పాట రాదు, పాడ లేదు. చివరికి ఒక ముసలమే,అంధురాలు
లో.... అంటూ పాట మొదలుపెట్టింది , లోల్లోలోరేలోల్లె దానికి అందరు జత కట్టారు. నా
మటుకు బీతొవెన్ మూన్ లైట్ సొనాట,ఓ వెన్నెల ఆమె నేత్రాల్లో బంది అయ్యి ఆమె గళం
ద్వారా అందరిని జతకట్టించింది. అందరు పాతనల్లె వాళ్ళే. అవును మనది రాతి యుగం ,మనం
కేవలం సృజనాత్మక కోల్పోతున్న శ్రోతలం. అడవి వినోదం కోసం చూసే పర్యాటకులం,అక్కడి
జీవితలాన్ని ఇకో టూరిజం పెర్న వాళ్ళ గడప
ఎదుటే వాళ్ళు నృత్యం చేస్తుంటే
వినోదం చూసే వాళ్ళం.
కధ-3
వాళ్ళ పరిస్ధితి చూస్తుంటే
నాకు హైకూ లు కనపడతాయి.
మా వూరిలోనే
నేనిప్పుడు ప్రయాణికుడిలా
పడుకుంటాను
-క్యొరాయి
(అనువాదం-గాలి
నాసరెడ్డి)
హైకూ లు చాలా
అందంగా కనపడ తాయి కాని వాటి స్టేట్ అఫ్
మైండ్, నిరాడంబరత,ఒంటరితనం,పరిపూర్ణంగా అంగీకరించడం,ప్రపంచానికి అతీతంగా వుండడం,
మేధావితనం లేకపోవడం,విరుద్ధత లేకపోవడం,హాస్యం,స్వేచ్చ,సదాచారం కొరవడడం, ,అభౌతికత,ప్రేమ,
దైర్యం.(ఆర్.హెచ్.బ్లిత్).ఇవన్నీ లక్షానులన్నప్పుడు పర్యావరణియం కల్మషం లేకుండా వుంటుంది. ఇప్పుడు
అంతరించిపోతున్నది మనలో ఆ వూరడవొళ్ళ హైకూ చూపు.ల హారం.
ఎంత త్వరగా
మరనిస్తుందో
ఎలాంటి సూచనా లేదు
కీచురాయి అరుపులో
-బషో
(అనువాదం-గాలి
నాసరెడ్డి)
0 comments:
Post a Comment