Tuesday, 19 May 2015 By: satyasrinivasg

అణువిస్ఫోటాలు-పర్యావరణ విధ్వంసం-33

1986 చెర్నోబిల్ అణు శక్తి కర్మాగారం నుండి వెలువడిన అణుధార్మిక వాయువు వల్ల చెర్నోబిల్ నగరం ఖాళీ చేసారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రమాదకర అణు విధ్వంసం ఇది. ఈ కర్మాగారంలో పనిచేసే కార్మికులకు చెర్నోబిల్ కి దూరంగా ప్రిప్యాట్ అనే ప్రత్యేక నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు చెర్నోబిల్ నగరంలో చాల కొద్ది మంది వున్నారు. వారి ఇళ్ళ పై వుండే బోర్డ్ల  పైన ఇంటి యజమాని ఇక్కడ ఉంటాడుఅని రాసి పెట్టి వుంటుంది. గతంలో  నగర జనాబా 14౦౦౦ మంది. ఇప్పుడది ఒక నిర్జీవమైన ప్రదేశం. చెర్నోబిల్ అన్నదానికి అర్ధం నల్ల గడ్డి లేదా నల్లని బాట .అవును .అణు విస్ఫోటం తర్వాత అ ప్రదేశం మానవాళి అవాసాలకి సరైన  అర్ధం గా మిగిలింది. ఐ.ఎఫ్. షుమేకర్ జర్మన్ ఆర్ధిక శాస్త్ర వేత్త, పర్యావరణ తాత్వికుడి అణు శక్తి – మోక్షమా లేక విధ్వంసమా అంటూ ఇచ్చిన వివరణ , భవిష్యత్తు  శక్తి అవసరాల కోసం ఆరాటం వల్ల మనం నిశ్చలతను  క్రమేణా కోల్పుతున్నాం.  జనాలందరూ అణు శక్తి వినియోగం అన్నది సరిగ్గా ఇదే సమయంలో వెలుగులోకి వచ్చింది అని అనుకుంటున్నారు. కొద్ది పాటి మంది కూడా ఇప్పుడు తెలిసి దాని పూర్వాపరాల గురించి అలోచించడంలేదు.ఇది కొత్తది, వినూత్నమైనది,అభ్యుదయకరమైనది,అంటూ అతి చవకగా లబిస్తుంది అని వాగ్దానాలు చేశారు.  ఇది కొత్త శక్తి మార్గం కాబట్టి  ఇప్పుడు కాకపొతే ఎప్పటికైనా అవసరం అని  వెనువెంటనే అమలులోకి తెచ్చుకున్నాం. ఇది కేవలం అణు శక్తిని వినియోగమే కాదు, ఆర్ధిక శాస్త్రం అనే మతం వల్ల వెనువెంటనే మార్పులు సృష్టిoచాలనే సిద్ధాంతాన్ని ఏర్పరుస్తుంది. ప్రశ్నించకుండా  ఆహ్వానించే పురోగతి  సంశయాస్పదమైన వరమా అన్న     ప్రామాణిక మైన వాస్తవాన్ని విస్మరిస్తుంది. వీటికి సాక్ష్యాల్ని పర్యావరణ ధృక్పధాన్ని నమ్మే వారే ఉంచుతారు.వాళ్ళుమానవాళి పై జరిగిన విధ్వంసాన్ని చూపించనంత కాలం ఇది అలా కొనసాగుతూనే వుంటుంది.
అటు వంటి సాక్ష్యమే ఈ కవిత...
ప్రిప్యాట్ కి
1.
మనం నష్టపరిహారం ఇవ్వలేము యధాస్ధితికి తేలేము
ఆ ఏప్రిల్ నాటి తప్పిదాల్ని ఘోరాల్ని.
అంతరార్ధ భారంతో వేలాడిపోతున్న   భుజాలు
జీవన వేదనను మోస్తుండాలి.
ఇది అసాధ్యమైనది, నన్ను నమ్మండి,
అధిగమించడానికి
సవరించుకోడానికి
కోల్పోయిన మన గూడు కోసం.
బాధ మన గుండె చప్పుళ్ళలో కొలువుంటుంది
భయంతో ముద్రించిన జ్ఞాపకం లా .
అక్కడ,
చేదుగుర్తులు చుట్టు ముట్టు వుంటాయి,
విస్మయంతో మన నగరం ఆడుగుతుంది:
అది మనని ప్రేమిస్తుంది కాబట్టి
అన్నింట్ని క్షమిస్తుంది,
ఎందుకు ఎప్పటికి దానిని వదిలేసాం అని ?
2.
రాత్రిప్పుడు, తప్పకుండా, మన నగరం
పూర్తిగా నిర్నిర్జీవమైనప్పటికి, మళ్ళీ జీవం పోసుకుటుంది
అక్కడ, మన కలలు మబ్బుల్లా తేలుతాయి,
వెన్నెల వెలుగుతో కిటికీలు కాంతిస్తాయి.
అక్కడ చెట్లు చెదరని జ్ఞాపకాలతో నివసిస్తాయి,
చేతి స్పర్శని మర్చిపోకండి,
వాటికి  ఎంత భాద వుందో  తెలుస్కోడానికి
వాటికి కంటూ ఏనీడ వుండదు
మండుటేoడ నుండి కాపాడుకోడానికి!
నడి రాత్రి వాటి కొమ్మలు నిశబ్దంగా కుదుపుతాయి
రగులుతున్న మన కలల్ని.
నక్షత్రాలు కిందకి జేరుతాయి
ఫుట్ పాత్  మీదకి,
పగటి వరకు కావలి కాయడానికి...
కాని గంటలు గడుస్తుంటాయి...
కలలు  వదిలేసినట్టు,
అనాధ ఇళ్ళు
వాటి కిటికీలు
వెర్రివై పోయాయి
బిగుసుకుపోయి మనకి వీడ్కోలు చెబుతాయి...
3.
మనం మన  బూడిద మీద  నిల్చున్నాం;
ఇప్పుడు సుదీర్ఘ పయనం సాగించాలి?
మనం ఎక్కడికి వెళ్ళినా భయం  రహస్యంగా    వెన్నంటే వుంటుంది
మనం అనావశ్యకులం?
కోల్పోయిన బెంగ
ముఖ్యాంశమని వెల్లడించింది
అకస్మాత్తుగా విచిత్రoగా సంతతి లేనివారమని,
విధ్వంసం  అంటే  మనకి ఇది కాదు అని చూపించింది
సృష్టించిన వారు,ఒక రోజు,
విధ్వంసానికి గురవుతారని?
... మన సముహం నుండి మనం వేలివేయబడ్డం
కటోరమైన శీతలకాలంలో...
నువ్వు, ఎగిరిపో!
కాని నువ్వు ఎగురుతునప్పుడు
నేలమీదున్న మమ్మల్ని మర్చిపోకు!
ఆనందకర దూర ప్రాంతాలకు పయనమైనప్పటికీ
నీ సంతోషకర మైన రెక్కలు నిన్ను మోస్తాయి,
తెగిపడిన మా రెక్కలు
నిర్లక్ష్యం నుండి నిన్ను కాపాడుతాయి.
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్)
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)

ఈ కవితలో విధ్వంసం లో ఒదిగివున్న వివిధ రూపాలు కనడతాయి అలానే ప్రకృతి  పట్ల  మన సమర్ధవంతమైన నిర్లక్ష్యం.
అంతరాద్ధ  భారంతో వేలాడిపోతున్న   భుజాలు
జీవన వేదనను మోస్తుండాలి.
అవును మనకు అన్నిటికీ సాక్ష్యాలు కావాలి , మరీ ముఖ్యంగా ప్రకృతి లోని ప్రతి అణువుని మనం ఉపయోగిoచకుండా విడిచిపెట్టం కాబట్టి. ప్రతిది రాబడి కోసం ఉపయోగిస్తూ పోతూ మన అణువులోని తాత్విక ప్రేమ గుణాన్ని సైతం మనం ముడిసరుకుగా మార్చేసాం. ఇప్పుడు అభివృద్ధికి కావాల్సిన శక్తి ఇంధనం మన అణువులోని ఆ గుణాన్ని కబళించడం.ఆ గుణం నుండి మనని మనం నిర్వాశితుల్ని చేస్కోవడం . ఇప్పడు జీ.డి.పి. కి వున్న నిర్వచనం గ్రాస్ డొమెస్టిక్ ప్రాడెక్ట్ కాదు , గ్రాస్ డిస్ప్లేసిడ్ ప్రాడెక్ట్. అది  వివిధ రూపాల్లో జరుగుతుంది. అందులో మనని భూమి నుండి, భూమిని విశ్వం నుండి జరిగే ప్రక్రియలు కోకొల్లలు. ఇదే గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిక. అందుకే జీవితం జీవన వేదనను మోసే యంత్రం. ఈ యంత్రానికి ఆవాసమైన నగరం మనని అడుగుతుంది(పంక్తులు-13-16) ఎందుకు దానిని వేదిలేసాం అని. కాని  వదిలేసింది నగరాన్ని కాదు. నగరానికి అణుమాత్రం పచ్చని చోటివ్వలేని మన నాగరికాన్ని.అందుకే
మనం మన  భూడిద మీద  నిల్చున్నాం;
ఇప్పుడు సుదీర్ఘపయనం సాగించాలి?(పంక్తులు-37-38)
ఈ పయనంలో మనం సంతతిలేని వారమవుతాం(పంక్తులు-39-43).
అంతర్జాతీయ చర్చల్లో గ్లోబల్ వార్మింగ్ గురించి వున్నా ఆందోళన కంటే అణుశక్తి, అవశేషాల నుండి పొందే ఇందనం గురించి పెరుగుతున్న  గ్లోబల్ క్యాపిటలిజం పైనే  మక్కువ ఎక్కువగా వుంది.
విధ్వంసం అంటే  మనకి ఇది కాదు అని చూపించింది
సృష్టించిన వారు,ఒక రోజు,
విధ్వంసానికి గురువుతారని?(పంక్తులు-44-53 ) కవితలో ఈ ఆవేదన స్పష్టంగా  కనపడుతుంది.
బహుళ ప్రచారంలో వున్న సిద్ధాంతం ఇప్పటి వరకు క్లాస్ స్ట్రగుల్ గురించి చెప్పింది, క్లాస్ స్ట్రగుల్ లో రిసోర్స్ స్ట్రగుల్ గురించి అంతగా పట్టించుకోలేదు.
తెగిపడిన మా రెక్కలు
నిర్లక్ష్యం నుండి నిన్ను కాపాడుతాయి
ఈ తెగిపడిన రెక్కల పుణ్యామా అని దోచుకునేవాళ్ళకి శిక్షలు పడట్లేదు. కారణం ఇదంతా అభివృద్ధి మాయా జాలం. శాంతి కోసం అణు శక్తిని వినియోగిస్తాం అన్న నినాదాల వెనుక ఎంత హింస  వుందో గుర్తించడం లేదు. ప్రబలుతున్న ఆర్ధిక నియంతృత్వం కనిపించడంలేదు.అణు విచ్చేదనలో  మానవాళి మనుగడకు కలిగే ముప్పు లో పోల్చుకోలేని,నమ్మశక్యంగాని విషయాలున్నాయి అన్నది అంచనాలకు అందని లెక్క .

ఇకో క్రిటిజిజంలో కొందరి అభిప్రాయం పర్యావరణం గురించి చెప్పడంలో కవిత్వం కంటే నాన్-ఫిక్షన్ ద్వారా బాగా చెప్పగలుగుతారని, కారణం వాస్తవాల్ని తెలియచేయాలన్న ఉద్దేశ్యం అందులోనే చేయగలుగుతామని. కాని పై కవిత ఆ పరిధిని దాటింది.ఏ విషయం పైనైనా  రాయడానికి కావల్సింది కేవలం ఆ విషయం మీద  వుండే వాత్సల్యం సరిపోదు, ఆ విషయం పైన పట్టు తో బాటు, సిద్ధాంతాన్ని కవిత్వీకరణ చేయగల సామర్ధ్యం. అ  స్ధాయికి పర్యావరణ అంశం ఇంకా చేరలేదు. కారణం పర్యావరణ సిద్ధాంతాల గురించి జరగాల్సినoత అటామిక్ ఫుష్యన్ ఇంకా జరగలేదు. దీని కోసం చరిత్రని డి లర్న్ ,రి లర్న్ చేయాల్సిన అవసరం వుంది. అదే విధంగా కవిత్వాన్ని కూడా. పర్యావరణ కవిత్వం కేవలం కవిత్వం కాదు ప్రకృతి సంరక్షణ,వినియోగం, నిర్వహణకి  సంబంధించిన సిద్ధాంతం. ఇది ఇకో –నామిక్స్,

0 comments:

Post a Comment