Tuesday 5 May 2015 By: satyasrinivasg

భోపాల్ రాత్రి -పర్యావరణ విధ్వంసం -31

డిసెంబర్  3,1984,రాత్రి 11.30 గంటలు .అప్పుడే యూనియన్ కార్బైడ్ కంపెనీలో సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం మొదలైంది. రాత్రి ఒంటిగoటకు ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళు దగ్గుతూ లేవడం మొదలెట్టారు, అలా లేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతోంది. బాధని తట్టుకోలేక ఆస్పత్రి వైపు పరుగులు తీసారు, ఓపికున్న వాళ్ళు ఆసుపత్రి చేరారు, లేని వాళ్ళు దారిలోనే తుదిశ్వాస విడిచారు. ఈ  గ్యాస్ పిడితులు తమకు న్యాయం జరగాలని కోర్టు దారి పట్టారు. ఆ దారి రహదారి కాదు,30 ఏళ్లుగా ఆ ప్రయాణం కొనసాగుతూనే వుంది. ఆ ప్రయాణాన్ని అడయరనుమోన్ తన కవిత ద్వారా చిత్రించారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన కవిత-సుప్రీం కోర్టు
అడయరనుమోన్  మొదలెట్టిన చర్చ
భోపాల్
విస్తృతమైన సమాచారాన్ని సమీక్షుతున్నాను,
విధ్వంసానికి సంబంధించిoది  అది భోపాల్,
అది చదివే అవకాశం నాకు లభించింది,
...చాల కోర్టు తీర్పులని,
సుప్రీం  కోర్టు తీర్పులు కుడా,
హైకోర్టు, జిల్లా కోర్టు,
ఇంకా  అమెరికా జస్టిక్ కీనన్ వి,
ఈ తీర్పులన్నీ ఎలావుండాలో అలానే వున్నాయి,
ఇవన్నీ విధ్వంస కారకాల్నిసమర్ధిస్తూ ,
ప్రతి తీర్పు సుదీర్ఘమైనది, విస్తృత కాలం పట్టినవి ,
అన్నీ సమస్య లోతుల్లోకి వెళ్ళినవే
ప్రతిదీ సమస్యని చట్ట పరంగా పరిశీలించినవీను,
ఆవి ఊక నుండి గింజని  విడదీశాయి,
తీర్పులన్నీ అద్భుతం, గొప్పవి,
భోపాల్ జిల్లా కోర్టు తీర్పు,
మధ్యంతర పరిహారం చెల్లించాలన్న ఉత్తర్వునిచ్చింది,
భోపాల్ హై కోర్టు కూడా,
దీని వల్ల మధ్యంతర పరిహారం  వంద కోట్లకి కుంచించుకుపోతుంది,
దీనినే మళ్ళీ సుప్రీం కోర్టు చెప్పొచ్చు,
ఇది  సమస్యకి  దీర్ఘ కాల ముగింపు పలకొచ్చు ,
ఇది యూనియన్ కార్బైడ్ ని నష్టపరిహారం కట్టమని ఉత్తర్వు అవ్వచ్చు,
ఇదంతా నష్టానికి బాధ్యులైన వార్ని రుణ విముక్తుల్ని చేస్తుంది,
ఇది సివిల్ అయినా క్రిమినల్ అయినా,
దీనికంటే ముందు జస్టిస్ కినన్ తీర్పు,
ఎవరైతే అమెరికా చట్టాన్ని విశ్లేషిస్తారో,  
అమెరికా దీనికి సరయిన ప్రదేశం కాదని ప్రకటిస్తారో,
కేసు మళ్ళీ భారతీయ కోర్టులకి చేరుతుంది,
ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు విస్మరించాలి,
భోపాల్  లయబిల్టి చట్టం ఆమోదం  అవ్వడాన్ని,
బాధితులందరి బాధ్యతలని స్వీకరించడాన్ని,
కోర్టులో  కేసులు వేయడం, వాదనలని,
వాటికయ్యే ఖర్చులని   తీసుకోకుండా వుండడం.
ఆ తర్వాత మరిన్ని తీర్పులు,
క్రిమినల్ బాధ్యతల ఉత్తర్వులను కొట్టిపారేస్తున్నట్టు,
లేక క్రిమినల్ బాధ్యతలను కేవలం కొన్ని క్రిమినల్ సెక్షన్స్ కి పరిమితిస్తున్నట్టు,
లేక రివ్యూ పెటిషన్ ఉత్తర్వుకి సంబంధించినట్టు,
లేక చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పుకి ,
ఎనిమిది మంది ముద్దాయిలకి రెండేళ్ళ శిక్ష ఖరారు చేస్తూ,
ఈ మధ్య కాలంలో  తొమ్మిదో వాడు చనిపోయాడు,
ఈ  నివేదికలన్నిటినీ చదవడం గొప్ప పని ,
ఇంక చట్టంలోని మూలాల్ని అర్ధంచేసుకోవడం,
ఇంకా చట్టాల్ని వాటి దృక్పధాల్ని,
అవును, ఎంతో నేర్చువాల్సింది, అర్ధంచేసుకోవాల్సింది వుంది.

నేను  సమాధానాలని అన్వేషిస్తున్నాను
నా మదిలో వుండే కొన్ని ప్రశ్నలకి,
కాని, ఒక దానికి మటుకు ఖచ్చితమైన సమాధానం దొరికింది,
అదేంటంటే  నేను బస్ మిస్ అయ్యాను,
నేను అమెరికా లో జన్మించని కాలం,
ఎందుకంటే ఎంత మొరపెట్టుకున్నా,
మానవ హక్కులు  ,మానవ జాతి గౌరవం గురించి,
ఇంకా ప్రపంచ మానవ హక్కుల ప్రకటన,
ఇంకా  విస్తారమైన ఐక్య రాజ్య సమితి ఒప్పందాలు,
అసలు నిజం ఏంటంటే,
తూర్పు,తూర్పే, పడమర పడమరే,
ఇవి ఎప్పటికీ ఒకే తీరులో ఆలోచించవు,
ఎప్పటికీ కలవవు,
సమానత్వం అన్న వేదిక  పైన,
అందుకే నువ్వు భారత దేశంలో జన్మిస్తే,
నువ్వు  భారతీయుడిగానే చావాలి,
చచ్చిన తర్వాత కూడా అలానే  మిగులుతావు,
చివరిలో ఒక భారతీయుడిగా,
ఎవరి బతుకునైతే  నష్టపరిహారంతో భర్తీ చేయాలో,
క్రమాంకన చేసే స్ధాయిలో,
ఈ నిష్పత్తి   ,
దేశ  జీడిపి కి తగినట్టుగా  వుండాలి,
ఇంకా  అమెరికా కి కూడా,
అందుకే ఇది పచ్చి నిజం,
నేనెప్పటికీ మర్చిపోను.

అండర్సన్ ఇంకా మహేంద్రా
మననందరికీ తెలుసు
భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రధాన నిందితుడు,
ఎవరో కాదు అండర్సన్,
... పూర్తి పేరు వారెన్ మార్టెన్ అండర్సన్  ,
ముఖ్యమైన సహకారుడు కేషుబ్,
ఇప్పుడు శిక్షార్హుడైన ఒకడు,
రెండేళ్ళ  ఖైదు,
మరొకరు  తప్పించుకుని తిరుగుతున్న  నేరస్ద్తుడు,
యు ఎస్ ఎ లోనే దాక్కున్నాడు.
తెలుస్కోడానికి కుతూహలంగాను      
చాల బాధాకరంగా వుంటుంది,
అదే అండర్సన్
వలస పోయిన ఒక స్వీడిష్  వ్యక్తి కుమారుడు,
ఎదగాలని అమెరికాకి వచ్చినతను,
అతను ఒక చిన్న సేల్స్ మ్యాన్ గా జీవితం మొదలెట్టాడు,
గొప్ప చదువులు నేర్చుకోలేదు,
చెప్పుకో దగ్గ గతం లేదు,
కసి, పట్టుదల ఇంకా ఆశయం తప్ప,
జీవితంలో తనంటూ  తను నిరూపించుకోవాలని,
ఇది  అతను నిస్సంకోచంగా  నెరవేర్చుకున్నాడు,
ఆయన యూనియన్ కార్బైడ్ కి చైర్మెన్ అయినప్పుడు,
ప్రపంచంలో అతి పెద్ద మూడవ  కంపెని,
ఇప్పటికీ  అదే మాట చెపుతాడు,
తను నైతిక విలువల్ని   నమ్ముతానని,
నిజాయితీని శ్రద్ధ పాటిస్తానని,

మహేంద్ర విషయంలో ఏమీ తేడా లేదు,
ఆయన కంపెని గురించి చెప్పే విషయాలలో,
ఆయన  ఇతరులకు సహాయ పరుడని
కార్పొరేట్  పాలనా వ్యవస్థకి పునః నిర్వచనం ఇచ్చాడని
నిధులని సమర్ధవంతంగా సమకూర్చాడని
సామాజిక రంగంలో.
ఆయన గురించిన దాంట్లో వ్యక్త పర్చుకున్నాడు
ఆయన అన్నిటిలో ఎల్లప్పుడూ
భారత దేశంలో నైతిక విలువలున్న కార్పరేట్ వ్యవస్థని స్థాపించాడని.

ఇవి ఇరువురికి సంబంధించిన వాస్తవాలు
అన్నీ పచ్చి నిజాలై ఉండొచ్చు
కానీ కాలం వచ్చినప్పుడు,
వార్ని పరీక్షించే ఘడియలు చేరినప్పుడు,
వారు నిరుపించుకున్నది
మామూలు అడుగుజాడలే,
లేక  మేము అందరి లానే అని,
సగటు మనుషులమే అని,
పెద్ద మాటలతో


ఈ పొడి మాటలు ధరిత్రిని  కళంకం చేసే ఘటనలు

0 comments:

Post a Comment