Tuesday 26 May 2015 By: satyasrinivasg

అణు విస్ఫోటాలు-పర్యావరణ విధ్వoసం-34

భారం
ఎంత విచిత్రం
నా ముప్పైయ్యో ఏట
బతకకూడదని
ఇక అదికాక
కొనసాగించాలంతే...
గడిచిన కాలాన్ని
అందమైనవి, భయంకరమైనవి,
బరువైనవి,తడిసిన, మొద్దుల్లా..
సమాధిలో వున్నట్టు!
ఆత్మలు ఆలపించవు
గతిలేక మూగవైపోతాయి:
రోగగ్రస్తులవుతాయి
నొప్పులు  భరించేకంటే
అందుకే  శ్వాస తీసుకోవడం కష్టం.
నేను ఎగరదలచుకోలేదు!
లోతులేని అంచున వున్నా.
స్వర్గపు చేరువలో వున్నా.
ఇప్పటికే ఈ దారులలో అలసిపోయా,
నన్ను ఎగరేసినవే...
ఇక పై ఎగరలేను!
స్వర్గంలో మొహాలు  ప్రతిబింబిస్తాయి.
వాళ్ళ మొహాలు
నేనెవరికైతే వీడ్కోలు చెప్పానో.
ఏ ఒక్కరినీ మరవలేను!
మర్చిపోయే స్ధితి లేదు!
ఆత్మ, అది వున్నట్టుగా వుండడం—
దుర్లభమైన స్మ్రుతి
దేనినీ  తుడిపేయలేo,
దేనినీ తీసేయలేo,
దేనినీ రద్దుచేయలేo,
దేనినీ సవరించలేo!..
... ఇక మిగిలిన,-- భారం కూడా  పవిత్రమైనదే,
ఎంత బరువుంటే
అంత ప్రియమైనది!
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్), పునః సమీక్షించిన వారు-ల్యుబోవ్ సిరోటా)
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)
--------
రేడియో ఫోబియా
ఇది కేవలం-- రేడియేషన్ గురించి భయమా?
లేక-- యుద్ధం గురించి ఆందోళనా?
లేక-- యుద్ధం గురించి ఆందోళనా?
లేక-నమ్మకద్రోహం అన్న బెదురా,
పిరికితనం,మూర్ఖత్వం,చట్టలేమి?
వీట్ని సవరించే కాలం ఆసన్నమైంది
రేడియో ఫోబియా అంటే ఏమిటి.
అది—
చర్నోబిల్ డ్రామాని అనుభవించినవారు చెప్పడానికి నిరాకరిస్తారు
మంత్రులకు చెప్పిన వాస్తవాల్ని
("ఇక్కడఈ రోజు నువ్వు ఇంతే మింగ గల్గుతావు!")
మేము తప్పుకోం
అబద్ధపు రహస్య  సమాచారాలనుండి,
మూల ఆలోచనలనుండి,
మీరు ఏ రంకా చిత్రీకరించినప్పటికి!
మేము ఆశించం-- ఇక మీరు సూచిoచకండి వాట్ని!—
ప్రపంచాన్ని అధికారిక  కళ్ళద్దాలతో చూడమని!
మాకు చాలా అనుమానాలున్నాయి!
ఇంకా, అర్ధమవుతుంది, మాకు జ్ఞాపకం
ప్రతి బాధితుడు సోదరుడు లాంటి వాడు!...
ఇప్పుడు మనం  సున్నితమైన భూమిని చూస్తున్నాం
వదిలిసేన భవనాల అద్దాలనుండి.
ఈ అద్దాలు ఇంక మనని మోసం చేయలేవు!—
ఈ అద్దాలిప్పుడు మనకి స్పష్టంగా చూపిస్తాయి—
నను నమ్మండి—
కుంచికుపోతున్న నదులు,
విషపూరితమైన అడవులు,
పిల్లలు జన్మించేది ఎదగడానికి కాదు...
పెద్ద మామలు , మీరేమి పెట్టారు
టెలివిజన్ లో ధైర్య నటనకంటే?
పిల్లలెంత ముచ్చటగా ఆస్వాదించారో
రేడియషన్, ఒకప్పుడు ప్రమాదకరమని నమ్మినదాన్ని!...
(పెద్దలే రేడియోఫోబియాతో  భయపడతారు—
పిల్లలు ఇంకా దీనికి అలవాటుపడుతున్నారా?)
ఈ ప్రపంచానికి ఏమైంది
అత్యoత  మానవత్వo గల  వృత్తి కూడా
అధికారింగా మారిందా?
రేడియో ఫోబియా
ఏమో మీరు సర్వాoతర్యామిలు అయ్యిండొచ్చు!
అదనపు విపత్తులకు  ఎదురుచూడకపోవచ్చు,
కొత్త విధ్వంసాలకు,
వేలమందిని మార్చివుండోచ్చు
నరకంనుండి బతికి బట్టకట్టినవార్ని
ప్రవక్తలుగా—
ఇది రేడియో ఫోబియో నయంచేయవచ్చు
ప్రపంచాన్ని
నిర్లక్ష్యం,నిర్లజ్జ,అత్యాశ,
అధికారత్వం ఇంకా కొరవడిన ఆధ్యాత్మికత నుండి,
దాని వల్ల మనం ఒకరి పలుకుబడి  అవసరం  లేకుండా
మానవాళి నశించినది గా     మారుతాం.
(  రష్యన్  నుండి అనువాదం,లియోనిడ్ లెవిన్, ఎల్జివియత్ రిట్చ్)

(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)

0 comments:

Post a Comment