విశ్వంలోని రెండు
ప్రధాన అంశాలైన పదార్ధం , శక్తి, మధ్యవున్న సంబంధాల్ని సామాజిక రూపంలో
అర్ధంచేసుకోకుండా కేవలం పదార్ధాన్నిమాయం చేసి దానికి తుల్యమైన శక్తిని పొంది మన అవసరాలన్నీ తీర్చుకోగలమన్న సాపేక్షతా సిద్ధాంతాన్ని
నమ్మి ముందుకు సాగడం వల్ల సమాజానికి పునాది అయిన కుటుంబం అనే మూలాన్ని క్రమేణా
విచ్చిన్నం చేసేస్తున్నాం అన్నదానికి కేవలం చెర్నోబిల్ ఒకటే కాదు మన దేశంలోని జైతాపూర్ ఒక సజీవ ఉదాహరణ
.9900 మెగావాట్ల జైతాపూర్ న్యూక్లియర్ పవర్
ప్రాజెక్ట్ ప్రంచంలోని అతి పెద్ద పవర్ ఉత్పత్తి కేంద్రం. దీనిని న్యూక్లియర్ పవర్
కార్పోరేషన్ ఆఫ్ ఇండియా,అరేవా ,న్యూక్లియర్ పవర్ ఇంజనీరింగ్ ఫర్మ్ ,ఫ్రాన్స్ దేశం వారు
సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2005 ప్రాజెక్ట్ బాధిత ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు,938 హెక్టార్లలో 6 యూరోపియన్ ప్రేస్సరైసిడ్ రియాక్టర్లు నిర్మాణం
గురించి చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఉద్యమం పెద్ద ఎత్తున
ఎగిసింది. 2336 బాధిత కుటుంబాలలో,1744 కుటుంబాలు నష్టపరిహారం తీసుకున్నాయి, సుమారు 950 కేసులు జిల్లా కోర్టులో వున్నాయి. ఇందుకు కారణం చాల మంది తమ పేర్లు నమోదు
కాలేదన్న వాదన, కుటుంబంలోని వారి మధ్య తగువులు వారి,వారి వాటా కోసం. ఇదంతా
సామాజిక సాపేక్ష సిద్ధాంతం E= mc2. ఇక్కడ E, సామాజిక శక్తి, m అన్నది మనీ, c అన్నది కమ్యూనిటి. అక్కడ
వ్యాక్యుం.(c) సామాజిక పదార్ధం మని అనే కాంతిమాయలో కమ్యూనిటి జీవనాన్ని వ్యాక్యుం లోకి
ప్రయాణం చేయిస్తుంది.
కనుక ఈ సాపేక్ష
సిద్ధాంతాన్ని నాయకులు తమకు ‘అణు’కువుగా మల్చుకుంటారు. అది చెర్నోబిల్, నల్గొండా, కొదంకులం, జైతాపూర్,
బలియాపాల్ ,కోవాడా అన్నది ప్రసక్తి కాదు.
సాపేక్ష సిద్ధాంత
కర్త గొప్ప మానవతా విలువలున్న వ్యక్తి.ఐనస్టిన్ మనని సాంకేతిక పరికరాలకి బానిసలు
కాకూడదని హెచ్చరించాడు. కాని మనం మనలోని అణు శక్తిని దానికోసం వినియోగిస్తూ
పోతున్నాం. అక్షరాన్ని కూడా చివరకి వేలిముద్ర గా మార్చి మనం బయోమెట్రిక్
కార్డులవుతున్నాం.
దీనిని జేహన్నే దుబ్రౌ తన
కవితలో స్పష్టంగా వ్యక్త పరిచారు...
చెర్నోబిల్ సంవత్సరం
జేహన్నే దుబ్రౌ
మనం వికసించే పిల్లలకోసం కలలు కన్నాం,
వారి గొంతులు సజీవంగా క్యాన్సర్ తో నిండినవి,
చీకట్లో వారి చూపు వెలుగుతున్నట్టు,
మనం మన చర్మంలో ఉక్కకు గురవుతున్నట్టు,
6 వ గ్ర్రేడ్ , విధ్వంసం చేసినందుకు,
ఏమి లేదని నేర్చుకున్నందుకు
వెలుగెత్తి లేచిన చల్లబర్చే సౌధాలు కూలినట్టు
చిన్నవాటి పీడనం కింద-
కుటుంబంతో కల్సి చేసిన రాత్రి భోజనం, సాయంత్రపు వార్తలు,
మూగబోయిన టెలిఫోన్ డయల్ టోన్.
భూమి కుడా చప్పుడు చేస్తోంది.
కొత్తగా ఎదుగుతున్నవి విష పూరితమైనవి.
మనం తిన్నదంతా ఒక రాయి అయ్యింది.
మనం చెప్పినదంతా ప్రేమ లా..
ప్లుటోనియం, నిప్పు రవ్వ లా మారింది
భీబత్సంలో సమాది అయిన ప్రపంచం.
(అనుసృజన- జి. సత్య శ్రీనివాస్)
అవును మనవి ప్లాటానిక్ సంభందాలు కావు రావు కుడా, అంతా ప్లుటానికి విస్పోటన సంబంధాలే...
0 comments:
Post a Comment