ఈ స్వరాన్ని డిసెంబరు 22,1988 ఉదయాన ఆయన ఇంటి వద్దే నలిపివేశారు. అప్పటికే
ఆ ఏడాది 89 గ్రామీణ కార్యకర్తలను హత్య చేశారు.
చికొమెండిస్ తొంబయ్యోవాడు. భార్య ఇల్‌నమాన్ జి. బేజేర్‌వా, నాలుగేళ్ల కూతురు, రెండు సంవత్స రాల కొడుకు చూస్తుండగానే ఇంటి
ముందే హత్య చేశారు. నలభైనాలుగు వసంతాల వృక్షాన్ని అర్థాంతరంగా నరికేశారు. భూమిలో
చొచ్చుకుపోయిన వేళ్ళు,
ఆకాశంలో విర బూసిన పూలు. సర్వత్రా వ్యాపించే
పరిమళం. గాలితో కబురంపే లేత ఆకుల పచ్చదనం. ప్రతి ఒక్కరి పిడికిలిలో గూళ్ళు కట్టిన
పక్షులను,
వాళ్ళు ఎప్పటికీ హరించలేరు.
డిశంబరు 15, 1945న షావురి (ఏకర్) బ్రెజిల్‌లో జన్మించిన
చికోమెండిస్ చిన్నప్పటినుండి రబ్బర్ ట్యాషర్‌గా శిక్షణ పొందాడు. అడవిలో
జన్మించిన కారణంగా తన చుట్టూ వున్న వాటని తనదిగా అర్థం చేసుకోగలిగాడు. రబ్బర్
ట్యాషర్స్ అను భవిస్తున్న కష్టాలను ఆరికట్టడానికి 1970లో ఏర్పడిన షాపురి రూరల్ వర్కర్స్ యూనియన్ అధ్యకక్షుడిగా పనిచేశాడు. అసలే
అప్పుల వలయంలో చిక్కుకుపోయిన రబ్బర్ ట్యాషర్స్ పరిస్థితులను 1960-70లలో సంభవించిన మార్పులు దిగజార్చాయి. దక్షిణ
బ్రెజిల్ నుండి వచ్చిన వాణిజ్య వర్తకులు రబ్బర్ ఎస్టేట్స్ కొనుక్కుని, ఆ ప్రదేశాలకు పచ్చిక భూములుగా మార్చారు. దీని
కారణంగా నిరాశ్రయులైన రబ్బర్ ట్యాసర్స్ అడవుల లోపలికి వెళ్ళి బ్రతకవలసి
పరిస్థితి ఏర్పడింది. స్థానిక షావుకార్ల చేతుల్లో మోసపోవడం, అప్పుల వలయంలో చిక్కుకుపొవడం, బయటవారి ఆక్రమణలకు గురవ్వడం...వారి ఇంట్లోనే
వాళ్ళు అజ్ఞాతులుగా జీవించే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులకు ఎదురుతిరిగి తమ
హక్కుల కోసం పోరాడటానకి 1970లో షావురి రూరల్ వర్కర్స్ యూనియన్ ఏర్ప
డింది. అడవులను నరికివేయడానికి వచ్చిన ఇతర ప్రాంత కూలీలను ఆ పని చేయకుండా
అడ్డుకోవడం,
సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టడం, ఏకాభిప్రాయంగల విద్యావేత్తలు, సంస్థల నుండి సహాయాన్ని కోరడం తద్వారా వాటిని
కో-ఆపరేటివ్స్,
పాఠశాలలు ఆరోగ్య సదుపాయాల కొరకు వినియోగించడం
యూనియన్ పని ఫలితం గా వారి ఆర్థిక జీవనంలో ఆశాజనకమైన మార్పు కన్పించింది.
ఏ ఉద్యమమైనా రాజకీయ అధికార మార్పుని
ఆశిస్తుంది. ఈ మార్పు అధికార వికేంద్రీకరణకు నాంది గీతం ఆలపిస్తుంది. అదే అలాసన్-చికోమెండిస్.
పర్యావరణ సంరక్షణ,
ప్రకృతి సమతుల్యత అన్న పేరుతో వాటికి
పూర్తిగా విభిన్నంగా ఉన్న కార్యక్రమా లను బ్రెజిల్ ఆమోజాన్ అడవులలో అమలు
చేయటంవల్ల అక్కడ స్థానికుల జీవితాలు అస్తవ్యస్థమయ్యాయి. ఫలితం వనరులు పుష్కలంగా
ఉన్నప్పటికీ బ్రెజిల్ ప్రపంచంలో అత్యధికంగా అప్పులున్న దేశాల జాబితాలో చేరుకుంది.
వాణిజ్యపరంగా ఎంత సంపాదిం చిన్పటికీ అదంతా అప్పులు తీర్చడంలోనే ఖర్చు అవుతుంది.
త్వరత్వరంగా అప్పుల వలయంలో నుంచి బయట పడడానికి త్వర త్వరగా వనరులను
వినియోగించాల్సి వస్తుం ది. ఇందుకై స్థానిక భూమి వినియోగ పద్దతు లు మారాయి.
చెట్లునరికి వాటి స్థానంలో ఆదాయం కోసం మార్కెట్ పంటలు వేశారు.
కాఫీ, నూనె వచ్చే కూరగాయలు వంటివి అడవిలోకి చోచ్చుకు వాచ్చాయి. ఈ తోటలలో స్థానికులు
కూలీలుగా పని చేయ్యాల్సిన దుస్థితి వస్తుంది. వీటిని కొనుక్కునే దేశాలు తిరిగి
వీళ్ళకి (దేశాలకి) అప్పులు ఇస్తారు. అసలుకంటే వడ్డీ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు 1983-89 కాలంలో ల్యాటిన్ అమెరికన్, క్యారిబియన్ దేశాలవాళ్ళు తీసుకున్న
అప్పుకంటే 90 బిలియన్ యు.ఎస్ డాలర్స్ ఎక్కువగా
కట్టారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి, ఒక అడవికి,
ఒక ఈ గిరిజను డికి సంబంధించిన సమస్య కాదు. ఏ
అడవిని చూసినా ఇదే కనబడు తుంది. అడవులను కాపాడడమంటే కేవలం వృక్షాలను, పకక్షులను కాపాడుడం కాదు. అడవులతో సహజీవనం
సాగిస్తున్న జన సాంప్రదాయాన్ని కాపాడడం.
పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రబ్బర్
వినియోగం పెరిగింది. ఒక కాలంలో పంచులకీ, పాదకులకీ వినియోగించబడ్డ రబ్బర్ 18వ శతాబ్దంలో ఐరోపాలో సర్జికల్, వాటర్ ప్రూఫ్ క్లాత్ కొరకు వినియోగించ బడినది. 19వ శతాబ్దంలో టైర్‌ల వినియోగం కోసం వాడుకలోకి
వచ్చింది. దీని కారణంగా బయటవారు ఇక్కడికి వచ్చి స్థిరపడడం ప్రారంభించారు.
వాణిజ్యవ్యాపారం పెరుగుతున్న కొద్దీ స్థానికులకు ఇబ్బందులు అధికమయ్యాయి. తమ
వనరులపై తమకు ఏ విధమైన అధికారం లేకపోవడం, లాభాలు అందకపోవడం,
మారుతున్న భూమి వినియోగం, అడవుల క్షీణత స్థానికుల జీవనాన్ని క్షీణింప
జేశాయి.
స్థానిక ప్రజలకు ఎటువంటి కనీస సదుపాయాలు లేవు. ఇటువంటి వాతావరణంలో పెరిగిన చికోమెండిస్ అక్కడి ప్రజలను సమైక్యపర్చి వారి హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఉద్యమాన్ని స్థానికంగా బలపరుస్తూ, అదే సమయంలో ఇతర సంస్థలతో వ్యక్తు లతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేపట్టాడు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వంటి సంస్థలలో సభ్యత్వం పొంది వాటి ద్వారా ఉద్యమాన్ని మందుకు నడిపాడు. చికోమెండిస్ ప్రయత్నాలను గుర్తించి 1987లో అతనికి యు.ఎన్ వారు గ్లోబల్ 500 బహుమతి ఇచ్చారు. న్యూయార్కు కు చెందిన బెటర్ వరల్డ్ సంస్థ అతనికి పతకాన్ని బహూ కరించింది.1980లో రిమోడి జెవారియె చికోమెండిస్‌ను గౌరవ పౌరుడిగా ప్రకటించింది. జీవితపు తొలి పుటలలో నేర్చు కున్న పాఠాలు జీవితాన్ని మలుస్తాయి. బాల్యం అడవిలో గడిపాడు. అక్షరాలకు బడులు రబ్బర్ సేకరించడం అతని పాఠశాల. చదువుకో వడం వల్ల పిల్లలు తెలివిమీరి తిరగబడతారని యజమానులు పిల్లలను చదువుకోనియ్యకుండా చేసేవారు. అందరిలా చికోమెండిస్ కూడా ఓ బానిస '' 1982 సంవత్సరం ఓ మధ్యాహ్నం పూట మాఇంటి పక్క నుండి ఓ అజ్ఞాత వ్యక్తి వెళ్ళేడు. అతనిని నేను ఎప్పుడూ చూడ లేదు. అతని వేషధారణ చూస్తే ఇక్కడి వాడు కాదు. అప్పుప్పు డు వచ్చి మాతో మాట్లాడేవాడు. అతని చేతిలో ఓ పత్రిక. అది ఏమిటో నాకు అసలు తెలియదు. కాని దాని ద్వారానే నేను
స్థానిక ప్రజలకు ఎటువంటి కనీస సదుపాయాలు లేవు. ఇటువంటి వాతావరణంలో పెరిగిన చికోమెండిస్ అక్కడి ప్రజలను సమైక్యపర్చి వారి హక్కుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఉద్యమాన్ని స్థానికంగా బలపరుస్తూ, అదే సమయంలో ఇతర సంస్థలతో వ్యక్తు లతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేపట్టాడు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వంటి సంస్థలలో సభ్యత్వం పొంది వాటి ద్వారా ఉద్యమాన్ని మందుకు నడిపాడు. చికోమెండిస్ ప్రయత్నాలను గుర్తించి 1987లో అతనికి యు.ఎన్ వారు గ్లోబల్ 500 బహుమతి ఇచ్చారు. న్యూయార్కు కు చెందిన బెటర్ వరల్డ్ సంస్థ అతనికి పతకాన్ని బహూ కరించింది.1980లో రిమోడి జెవారియె చికోమెండిస్‌ను గౌరవ పౌరుడిగా ప్రకటించింది. జీవితపు తొలి పుటలలో నేర్చు కున్న పాఠాలు జీవితాన్ని మలుస్తాయి. బాల్యం అడవిలో గడిపాడు. అక్షరాలకు బడులు రబ్బర్ సేకరించడం అతని పాఠశాల. చదువుకో వడం వల్ల పిల్లలు తెలివిమీరి తిరగబడతారని యజమానులు పిల్లలను చదువుకోనియ్యకుండా చేసేవారు. అందరిలా చికోమెండిస్ కూడా ఓ బానిస '' 1982 సంవత్సరం ఓ మధ్యాహ్నం పూట మాఇంటి పక్క నుండి ఓ అజ్ఞాత వ్యక్తి వెళ్ళేడు. అతనిని నేను ఎప్పుడూ చూడ లేదు. అతని వేషధారణ చూస్తే ఇక్కడి వాడు కాదు. అప్పుప్పు డు వచ్చి మాతో మాట్లాడేవాడు. అతని చేతిలో ఓ పత్రిక. అది ఏమిటో నాకు అసలు తెలియదు. కాని దాని ద్వారానే నేను
చదువు నేర్చుకున్నది. ఒక రోజు ఆయన ఇంటికి
వెళ్ళాను. అప్పటి నుండి తరచు అక్కడికీ వెళ్ళడం,చదువు నేర్చుకోవడం మొదల య్యింది. అనేక రాత్రులు ఆయన చెప్పింది వినేవాడిని. ఒక
ఏడాది పరిచయం పిమ్మట ఆయన ఎవరో తెలిసింది. అతను సైన్యంలో పనిచేశాడు. అతని సహచరులతో
కలసి తిరుగుబాటు ఉద్యమాలు నడిపాడు. ప్రెస్‌ట్సి కొరకు ఉద్యమం సాగించాడు.
పట్టుబడ్డాడు. పారిపోయాడు. 1950లలో బొలిలీయన్ కార్మికుల కోసం పోరాడాడు. మైనింగ్ కార్మికుల కోసం అక్కడి
సైనిక ఒత్తిడివల్ల బ్రెజిల్ అడవులలోకి వచ్చి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తన
గురువు వద్ద నేర్చు కున్న పాఠాలు చికోమెండిస్‌ను ఒక మంచి ఆర్గనైజర్‌గా
తీర్చితిద్దాయి. ఉద్యమాన్ని బలపర్చడానికి చికోమెండిస్ వివిధ సంస్థలలో, వివిధ స్థాయిలలో పనిచేశాడు. 1968లో రబ్బర్‌ట్యాషర్స్‌ని ఆర్గనైజ్ చేయడంలో
చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. 1975లో బ్రెజిల్ యూనియన్‌లో సభ్యుత్వం, 1978 ప్రాంతంలో షావురి మున్సిపల్ కౌన్సిల్
ఎన్నికలలో పోటీచేసి గెలిచినప్పటికీ, తను అనుకున్నంత స్థాయిలో రబ్బర్ ట్యాషర్స్ గూర్చి ఏమీ చేయలేకపోయాడు.
ప్రస్తుతం ఉన్న యూనియన్లతో రబ్బర్ ట్యాషర్స్ సమస్యలు పరిష్కారం కావని కూడా
గ్రహించాడు. ఈ తరుణంలోనే (1978)
వర్కర్స్ పార్టీ ఆవిర్భవించింది. వర్కర్స్
పార్టీ పెరిగిన తీరు,
అవలంబించిన పద్దతులు చికో ఆశయాలకు అనుగుణంగా
ఉన్నాయి. ఈ పార్టీలో సభ్యుడుగా చేరాడు. 1982 వరకు పార్టీలో ముమ్మరంగా పనిచేసి ఆ తర్వాత షావురి రూరల్ వర్కర్స్ యూనియన్‌కి
పూర్తి సమయాన్ని కేటాయించాడు. ఇప్పటివరకు వారు చేపట్టిన ఉద్యమం రబ్బర్ ట్యాసర్స్
జీవితాలలో ఆశాజనకమైన మార్పులు కల్పించింది.ఉద్యమం పుణ్యమా అని 200,000 హెక్టార్ల అడివిని రక్షించ గలిగారు. కో-ఆపరేటివ్స్
స్థాపించారు. దాని ద్వారా రబ్బర్ ట్యాసర్స్‌కు కావలసిన కనీస సదుపాయాలు ఏర్పాడుతు
న్నాయి. కొన్ని ముఖ్యమైన రబ్బర్ ఎస్టేట్స్ ప్రాంతాల్ని రిజర్వుగా ప్రకటించి
సురక్షత ప్రాంతాలుగా సంరక్షించ గల్గుతున్నారు.
ఇన్ని వైవిధ్యాలు గల ఉద్యమం ప్రపంచంలో చాలా
అరుదుగా కనబడు తుంది. అందులోను బ్రెజిల్‌లోని షావురి ఉద్యమం బహుశా మొదటిది.
ఇప్పటికీ పర్యావరణ ఉద్యమాలను కేవలం పచ్చజెండాలుగానే అర్థం చేసుకుంటాం. చికోమెండిస్
పోరాడినది రబ్బర్ మొక్కలు,
రబ్బర్ ట్యాసర్స్ కోసమే కాదు. అతను మనిషికి
పచ్చని మనస్సుని తొడిగాడు. చికో ఉద్యమానికి చెప్పిన నిర్వచనం తలుచుకుంటే ఉద్యమం
అనేది ఎందుకు చేపట్టాలో స్పష్టంగా తెలుస్తుంది. అతనికి తనని ఏలాగూ చంపుతారని
తెలుసు. అయినా పనిచేయడం కొనసాగించాడు. ఆయన చనిపోయే ముందు రాసిన ఉత్తరంలో '' నాకు తెలుసు, నన్ను చంపేస్తారని. నేను చచ్చిపోయిన తర్వాత నాశరీరంపై పెట్టిన పుష్ప గుచ్చాలు
ఏ అడవి చేట్టు నుండి వచ్చాయో నాకు తెలుసు. నేను వాటి కోసం చావడం లేదు. ఈ ఉద్యమం
చేపట్టింది చావడానికి కాదు. బ్రతకడానికి''.....
ఆమోజాన్‌లో అడివిని తీసి పచ్చిక బైళ్ళుగా
మార్చినా,
మన ప్రాంతాలలోని పాడేరులో మైనింగ్ చెపట్టినా
ఎంతమంది బ్రతుకుతున్నారన్నది ముఖ్యం. ఎవరు బ్రతుకుతున్నారనేది ముఖ్యం. మూల వాసులు తమ బతుకు తీరుని సరిదిద్దుకో గల
సత్తా గలవారు. వారిని ఎవరూ ఉద్దరించనవసరం లేదు. వారిని అర్థం చేసుకుని వారికి
తోడుగా వుంటే చాలు. చికోమెండిస్ చేసిన ప్రయత్నమిదే. అడవిపాట ఆలాపనకి అంతముండదు.
అడవిపాట స్పర్శ వేరు. దాని రంగు, వాసనే వేరు...
ఎర్రని రక్తపు రంగునుంచి వచ్చిన
పచ్చటి అరటి గెలా
ఎరుపచ్చని చీర కట్టి
నదికాడ తానమాడుతున్న
తీయన్ని విరహ వేదనా.
(ఒరిస్సా ప్రాంతం గిరిజనుల పాట)
పచ్చటి అరటి గెలా
ఎరుపచ్చని చీర కట్టి
నదికాడ తానమాడుతున్న
తీయన్ని విరహ వేదనా.
(ఒరిస్సా ప్రాంతం గిరిజనుల పాట)
వీటికి మనం భాష్యాలు చెప్పద్దు...అర్థం
చేసుకుంటే చాలు.
0 comments:
Post a Comment