మనమిప్పుడు సామాజిక,సంస్కృతిక,రాజకీయ,సిద్ధాంతాల పలు మార్పుల స్ధితిలో
వున్నామన్నదాన్ని కాదనలేము. సామజిక తీరుతెన్నులు,అవి నూతన ఒరవడులను ఒకదానిదో ఒకటి
ఏవిధంగా సాగుతున్నాయన్నది కేవలం విద్యావేత్తల అధ్యయనాలకే పరిమితంకావడం లేదు. మన
నరనరాల్లోకి మనకి తెలియకుండానే ఇంకిపోతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా జీవించడమే
మనం అనుభవిస్తున్న ఘర్షణ.ఈ విషయాన్ని పర్యావరణానికి అతీతంగా భావించడమే మనం
చేస్తున్న లోపం. వీట్ని గ్రహించి సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో రచయితలు తమ రచనల్ని కొనసాగించారు.భౌతిక
పర్యావరణాన్ని కాపాడడం కోసం విలువల ప్రాముఖ్యతను చెప్పారు. సామాజిక అంశాల్నిశాస్త్రీయ
అంశాలతో జోడించారు. ఇది పర్యావరణీయం అయ్యింది. వీరు ఉద్యమంలో చేరేసరికి ఉద్యమం
తీవ్ర స్ధాయికి చేరింది, ఆ వేగాన్ని వీరు మరింత పెంచారు. ఇది సాహిత్య పర్యావరణీయం
అయ్యింది. వైకం బషీర్,యస్.కే. పోట్టేకర్,ఓ,వీ. విజయన్, కే.భాస్కరన్ నాయర్,
సుకుమర్ర్ అజ్హికోడే వంటి వారు ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. వివిధ ప్రయోగాలు
చేసారు అందులో భాగంగా 1983లో 34 కవితలతో కూడిన వనపర్వం అన్న కవితా సంపుటిని ప్రచురించారు. సుగత కుమారి గారు సైలెంట్
వ్యాలీని ‘దట్టమైన,చల్లని, జీవం ఉట్టిపడుతున్న ప్రదేశం, భూమి వ్యక్త పరిచిన అత్యత్భుతమైన
భావన’ అంటారు. ఆ భావాలన్నీ వనపర్వంలో చోటుచేస్కున్నాయి. వనపర్వం అన్న శీర్షికకి
స్ధానికులు సైలెంట్ వ్యాలీ గురించి చెప్పే కధకి పోలిక వున్నది. ఈ ప్రాంతాన్ని
సైరంధ్రి వనం అంటారు. ద్రౌపది కి వున్న మరో పేరు సైరంధ్రి. వనవాసమప్పుడు పాండవులు
ఇక్కడ కొంత కాలం గడిపారని వారి నమ్మకం. కాలక్రమేణా బ్రిటిష్ వారి కాలం వచ్చే సరికి
సైరంధ్రి వనం సైలెంట్ వ్యాలీ గా మారింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి దగ్గర వున్న ఏనుగు
మల్లమ్మ కొండ కూడా బ్రిటిష్ వారి పుణ్యామా
అని హార్స్లీ హిల్స్ గా మారింది. అలా చాలా ప్రాంతాలని వారు మార్చారు. ఈ
ప్రాంతాన్ని చిపింగ్ సిడా అన్న అడవి క్రిమి వల్ల కూడా సైలెంట్ వ్యాలీ అన్న పేరు
వచ్చింది అన్న నానుడి కూడ వుంది.
ఒక
ప్రాంతాన్ని భౌతికంగా ఆక్రమించడానికి దాని చరిత్రను మార్చాలి ,అది నామధేయాన్ని
మార్చడం వల్ల చాలా తొందరగాను ,అనుకున్న ఆశయాన్ని సాధించడంలో ప్రయోగాత్మకంగా
సంభవిస్తుంది. వనపర్వం పర్యావరణ చరిత్రను
తిరగరాసే ప్రయత్నం చేసింది. ప్రకృతికి సంబంధించిన సాహిత్యంలో బైయో
సెన్ ట్రిసం, ఇకో సెన్ ట్రిసం, ఎర్త్ సెన్ ట్రిసం అన్న ధృక్పధాలు వున్నాయి తరచూ
ఒకదానికి ఒకటి పర్యాయంగా వాడుతారు. ఇవి ప్రస్ఫుటంగా థియో సెన్ ట్రిసం, హ్యూమన్
/ఆంత్రాపో సెన్ ట్రిసం ధృక్పధాని కి విభిన్నంగా ప్రయోగిస్తారు.
బైయో సెన్ ట్రిసం భూమి పైనున్న అన్ని జీవ,నిర్జీవ వ్యవస్ధాలకు సమాన భావాన్ని
అపాదిస్తాయి, ఇకోసేన్ ట్రిసం
ప్రకృతి సమతుల్యతను పలుకుతుంది, అది ప్రకృతిలోని జీవ,నిర్జీవ వ్యవస్ధలతో బాటు
చంద్రుడు,ఆకాశం,నక్షత్రాలను కలుపుకుని. ఆంత్రాపో సెన్ ట్రిసం మనషులను ప్రధానంగా పరిగణించి
మిగతా జీవరాశులను మనుషులకు ఉపయోగపడే వనరులుగా పరిగణిస్తుంది. ఇది ఇకోసేన్ ట్రిసంకి విరుద్ధమైనది.మానవజాతిని
విస్మరించలేము కాని మనవ మనుగడ అన్నది ప్రకృతిలోని మిగతా జీవ రాసుల పైన ఆధారపడి
వుంది. ఇకోసేన్ ట్రిసం అంటే జీవ వ్యవస్ధ కేంద్రంగా ఊహాజనకంగా ప్రతిష్టించడం ,కేవలం
మనుషుల్ని కీలకంగా కాదు. ఇకోసేన్ ట్రిసంకేంద్రం అన్నది అంటూ ఏమి వుండదు, ఒక
స్పెషల్ స్పేస్ లో, కేంద్ర బిందువుకి ,చివరి అంచులకి మధ్యన తారతమ్యాలంటూ
వుండవు,ముందు వెనకకు కూడా. (కేర్దిజ్). దీనిని అర్ధం చేసుకునప్పుడు మానవుడు
ప్రకృతిలో ఎంతపాటి భాగమన్నది అర్ధం అవుతుంది.
సాహిత్యం ద్వారా కేవలం సైలెంట్ వ్యాలీ అంశాలనే కాక ప్రకృతి మానవ మనుగడ గురించి
విశిష్టంగా ‘ప్రకృతి సంరక్షణ,సుస్ధిర జీవనం’ అన్న నినాదం తో ప్రకృతి సంరక్షణ సమితి పని చేసింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రచారానికి
కేరళ నలుమూలల వివిధ కళా రూపాల ద్వారా ప్రచారం చేసారు. 1980 జూన్,6 వ తేదీన కవులను సత్కరించారు. ప్రముఖ కవులు
కవితలు చదివి పర్యావరణ విశిష్టతను చెప్పారు. సైలెంట్ వ్యాలీ సంరక్షణకు వివిధ స్ధాయిల్లో సమితి కృషి చేసింది. అందులో సుగత
కుమారి గారు ప్రముఖ పాత్ర పోషించారు ,ఆమె రచించిన ‘మరతిను స్తుతి’(వృక్ష గీతం) విశిష్ట
ప్రాచుర్యం పొందింది. ఈ కవితలో ఆమె
చెట్టుని, భూమిని కాపాడడానికి విషం తాగిన
శివుడిగా వర్ణిస్తారు. నేను అతనిని పూజిస్తాను/ ఎవరైతే శ్వాస గాలినిస్తారో/ విషం
తాగి/నీలకంటుడిలా’(5-8). ఇదంతా పాటకుడికి కిరణజన్య సంయోగంగా అనిపించవచ్చు. ఈ కవిత ప్రకృతి
సమతుల్యతను శాస్త్రీయంగా వివరిస్తుంది. ప్రకృతిలో చెట్టు పాత్రను ,అది మానవ
మనుగడకు చేసే ఉపయోగాలను.
నువ్వు మా
తల్లి భూమిని వరదల నుండి రక్షిస్తావు
నేలను పునర్జీవింప చేస్తావు
నువ్వుఅమృతాన్ని భద్ర పరుస్తావు
దివినుండి భువి కి వస్తున్న దానిని
ఉబుకుతున్న నీ గుండెల్లో(౩౩-40,పంక్తులు)
భూమి ఏమైనా ఆడుకునే బంతా లేక ఆడుకునే బొమ్మా! (43-44 పంక్తులు)
ఈ కవితలో భూమి కున్న ఓపికను పరిక్షించొద్దని హెచ్చరిస్తారు. దీని ద్వారా ‘ప్రకృతి మన తల్లి ,ఆమెని పూజ్య భావంతో, ప్రేమతో దరి చేరమని చెపుతారు. మన చర్యలు విధ్వంశంగా వుంటే ప్రకృతి
ప్రతిచర్యలు అదే విధంగా ఉంటాయి’ ఇది అర్ధం చేస్కునే సునిశిత మనకు అవసరం.
0 comments:
Post a Comment