Friday, 27 March 2020 By: satyasrinivasg

పచ్చని రంగుల్లోని రహస్యం



పర్యావరణ అంశాలు మన ఆలోచనలకి ,చర్చలకి  విభిన్న ప్రశ్నల్ని జోడిస్తాయి.  గతంలో చర్చించిన నిచ్చ్ అన్న అంశాన్ని ఇంకా విస్తారంగా చూస్తే కొన్ని  అసంఖ్యాక నిచ్చులు కల్సితే ఒక హ్యాబిటాట్ అవుతుంది. అలా   అసంఖ్యాక హ్యాబిటాట్లు కల్సితే పర్యావరణం అవుతుంది, అలానే అసంఖ్యాక పర్యావరణాలు కలిస్తే  ప్రకృతి, యింకా సూర్య కుటుంబం! మరి సమస్య మూలం ఎక్కడ అన్నది ఒక బ్లాక్ హోల్. పర్యావరణ విపత్తులు ప్రకృతి పరంగాను, సామాజిక పరంగాను ఏర్పడుతాయి. ప్రకృతి పరంగా ఏర్పడే విప్పత్తులకంటే, సామాజికంగా ఏర్పచుకున్నవి పెరుగుతున్నాయి. మనం మన చేజేతులా  ఒక పచ్చటి నరకం సృష్టించుకుని దాని నుండి బయట పడాలన్న తాపత్రయం లో వున్నాం. విపత్తు వచ్చి నప్పుడే చిటికెన వేలు చప్పుడు సమయంలో పరిష్కారం కావాలి అన్న తాపత్రయం.
పర్యావరణ సమస్యల్ని అర్ధం చేస్కోవాలంటే ఇకలాజికల్ ఇంటలిజెన్స్ అవసరం. ప్రకృతి లోకి మన తిరుగు పయనం ఎందుకంటే నగర జీవనం (పచ్చటి నరకం) నుండి సాంతన దొరికే సామాజిక ప్రాకృతిక జీవనానికి మరల పయనం.  ఈ పయనానికి అవసరమైన చదువు సామాజిక ప్రకృతి విద్య(socio ecological literacy).  ఎందుకంటున్నానంటే  ఆర్గానిక్  సమాజం లేని కాలం లో వున్నాం , ఆర్గానిక్  ఉత్పత్తులు భుజించినంత మాత్రానే ఆర్గానిక్ అవ్వలేం! ఈ  ఇనార్గానిక్  ఆలోచన నుండి బయటపడి  మనం ఆర్గానిక్ గా ఆలోచించినప్పుడే, సమస్య లోతు అర్ధమవుతుంది. ప్రకృతి రహస్యాలన్నీ చేదించి దాని పై ఆధిపత్యం చెయ్యాలన్న దానికి మూలం మనలోని  సోషల్ డార్వినిజం దృక్పదం “సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్” .1920-1930లో అమెరికాలో యుజెనిక్స్ అనే ఉద్యమం జరిగింది అందులో అసమర్దులైన వారికి పిల్లలుండ కూడదు అనే ప్రచారం చేశారు,  అదే దేశంలో కు క్లక్ష్ కలాన్ పేర్న నల్ల జాతియులను
ఊచకోత   కోశారు,నాజీ ఉదంతాలు  మరో రూపంలో జరిగాయి. ప్రకృతి ఒకరి చేతుల్లోనే ఉండాలన్న వాంఛతో ఇవ్వన్నీ జరిగాయి. మానవ సమాజం పై ఆధిపత్యం,  జరపడానికి ముఖ్య కారణం ప్రకృతి అన్నదాన్ని ముడిసరుకుగా భావించి దానిని హస్తగతం చేసుకోవడం. ప్రకృతి అన్న విశాల అర్ధంలో మానవ సమాజం అంతర్ భాగం, ఇదంతా సోషల్ డార్వినిజం ఆలోచన. మనం ప్రకృతిని  వేటగాళ్ళల్లా  ఆక్రమించుకున్నాం,ఇప్పుడు కొద్దిగా ఇష్టంగానో,బలవంతాగానో వేటని వదులోకోవడమో, వేట పద్దతులు మార్చుకునే  మార్గాల్లోనో, తగ్గించుకునే పరిస్ధితిలునో వున్నాం!. ఎక్కువ శాతం వేట పద్దతులు మార్చుకునే మార్గాలే. మన  ఉత్సాహకతలో మార్పు వచ్చినప్పటికీ  అల్లిన వలలు మాత్రం అలానే వున్నాయి. ప్రకృతి సంరక్షణ శాస్త్రీయ.,చట్ట పరమైన వలలు ఏర్పడుతున్నాయి!. ఇది మన నేటి పరిస్తితి ,ది బాంబ్  ఇస్ టికింగ్ మనని ప్రాకృతిక ప్రపంచం చాలా  భరించింది, ఓపికతో సహించింది ,చాలా అంటే చాలా  .
మన దిల్ మాంగే మోర్ అనప్పటికి ప్రకృతి మాత్రం భరిస్తూ, ఇస్తూ వచ్చింది . కాని ఏ దిల్ భర్తా నహి! అందుకే నేమో విలియం వర్డ్స్ వర్త్  ఇలా ఆ బాధను వ్యక్తపరచాడు...
  ప్రపంచం మనలో చాలా ఎక్కువగా వుంది
విలియం వర్డ్స్ వర్త్
 ప్రపంచం మనలో చాలా ఎక్కువగా వుంది; గతంలోనూ ఇంకా ఇప్పుడునూ
తెచ్చుకోవడం, వినియోగించడం, మన శక్తిని నిరుపయోగం చేస్తున్నాం;- 
మనం ప్రకృతిలో మనకనుకుంటున్నదాన్ని  కొంచమే  చూస్తాం;
అనైతిక వరంలా!మనం మన మనసుల్ని వదిలేసుకున్నాం,
 సముద్రం  తన రొమ్ముల్ని వెన్నలకి తొడుగుతుంది;
అన్ని వేళలా వాయువులు  పెద్దగా అరుస్తూనేవుంటాయి,
ఇక పైకి చేరి ,ఇప్పుడు పూలల్లా నిద్రిస్తున్నాయి;
మనం,వీటికి, అన్నీటికీ అతీతులం;
ఇవేవీ మనని చలింపచేయవు.ఓ భగవంతుడా!ఇలా కాక నేను
అత్యాశ మత అచారలకీ  అతీతుడినవుతాను  ;
అప్పుడు కాని నేను, ఈ ప్రశాంతమైన మైదానంలో,
నన్ను ఏకాకి  చేయని దృశ్యాల్ని చూడగలను;
సంద్రం నుండి ఉదయించే ప్రోటియస్ దృశ్యాన్ని చూస్తాను;
లేక  వృద్ధ ట్రైటన్ మోగించే శంకనాదాన్ని వింటాను.

విలియం వర్డ్స్ వర్త్  ఈ కవితలో గతం నుండి వర్తమానం ,తన ఆశించే భవిష్యత్తు కల్పనని ప్రస్తావిస్తున్నాడు. మొదటి రెండు పంక్తుల్లో మనం సృష్టించుకున్న ప్రపంచంలో  అన్నీ గతంలోనూ ,ఇప్పుడు ఎక్కువగా నే వున్నాయని చెప్తూ వాట్ని మనం ఉపయోగించుతున్తున్నాం అన్న భ్రమలో శక్తిని (ఎనర్జీ) ని ఎంతగా దుర్విన్యోగం చేస్తున్నామో చెపుతున్నాడు. అవును నేడు మాట్లాడానికి కూడా సెల్ ఫోన్ లేనిదే మాట్లాడలేము, ఒక సెల్ ఫోన్ వినియోగం, తయారి లో ఎన్నివనరులు, వియోగించే తీరులోనూ  ఎంత మంది జీవితాలు నాశనం అవుతున్నాయి అన్నది అర్ధం చేస్కోవటం లేదు, ‘ఈ వెస్ట్’ అన్నీ ఘోషించినా మార్కెట్లోకి రోజుకో కొత్త మోడల్ దాని మిద మోజు తగ్గడం లేదు. ఆ రెండు పంక్తుల్లో మొతం మార్కెట్ ఎకనమీని, మనం ఎంత గా మార్కెట్ యానిమల్స్ అయ్యమో అర్ధమవుతుంది. ఇలా బతుకుతున్నపుడు మనం ప్రకృతిలోని జీవనయానాన్ని కొద్దిగానే చూస్తాం, ఎందుకంటే మన మనస్సు ఒక అనైతిక వరం గా మారింది. అప్పుడు మనలో ని ప్రకృతి సౌందర్య పిపాస కూడా ఒక జీవచ్చవంలా మిలుగుతుంది. అప్పుడు అవేవి మనని చలింపనూచేయవు, రసింపనూ చేయవు!  విలియం వర్డ్స్ వర్త్   దేవుడిని కోరుకునేదల్లా  ఇటువంటి అత్యాసతో కూడిన మతం కంటే తనకి అవాస్తావాలునప్పటికి గ్రీక్ మైధాలజి మార్గం సేరణ్యం అంటాడు, కారణం ప్రకృతిని ఆస్వాదించడానికి అది సైరన మార్గం గా తోచినందుకు...
సంద్రం నుండి ఉదయించే ప్రోటియస్ దృశ్యాన్ని చూస్తాను;, ప్రోటియస్ గ్రీక్ మైతలాజి ప్రకారం సముద్ర పుత్రుడు, బహుశా సూర్యుడు కావచ్చు, బీచ్ టూరిస్ట్లు లు ఎంతమంది దీన్ని కోరుకుంటారు! ఇలియట్ ఇదే విధంగా ప్రస్తావించాడు.
 చాలా సార్లు  మనలో ఒక సందేహం మొలుస్తుతుంది కవిత్వం వల్ల మార్పుని తేగలతామా?అని,  కవిత్వం వల్ల మార్పు జరుగుతుంది, కాని అది కూడా ప్రకృతి లాంటిదే, మనం నాటిన వెంటనే ఫలాన్ని ఆశించలేము, కవిత్వం  కూడా అంతే, మనం రాసిన వెంటనే ఫలితాన్ని ఆశించలేము, అది చదివే రీడర్ మీద, మనం అచ్చువెసే మాధ్యమం పైన ఆధార పడి వుంటుంది. మన మధ్యామాలు నేల లాంటివి , అన్ని ఒకే రకంగా అన్ని వేళలా ప్రతిస్పందించవు, విప్పత్తు వున్నప్పుడు ఓ లా ,లేనప్పడ్డు మరో లా వుంటాయి. నేడు సోషల్మాధ్యమాలని నియోగించే వారు చదువుకున్న వారే , చాలా మటుకు ఇది  ఇన్ఫర్మేషన్ లేక డేటా గా మిగిలిపోతోంది తప్ప హైయర్ లేవెల్ చేరడం లేదు, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గా మలిచినప్పుడు అది విజ్జ్డం (జ్ఞానం) గా వికసిస్తుంది, ఆ స్ధాయికి చేరడానికి కవిత్వం చాలా దోహద పడుతుంది. పోయట్రీ మ్యాగజిన్ ఎడిటర్ చిస్తియాన్ విమ్యాన్ మాటల్లో అంతిమంగా ఒక  కారణం వల్ల మనం కవిత్వం దగ్గరకు చేరతాం, మన జీవితాల్ని,ఈ ప్రపంచాన్ని మనం అస్వాద్దిదామన్న తపనతో.”
ప్రకృతిని మనం అనేక విధాలుగా చూస్తాం, వాట్ని మనం ఆనవాళ్ళుగా , సంకేతాలు, గుర్తులుగా పెట్టుకుంటాం, మనం మర్చిపోతున్నదల్లా  ప్రకృతి అంతరిస్తున్నది అన్నది కేవలం భౌతికమైన అంశం కాదు, ఇది మనం మానసిక అంశం కూడా అని . మనం ప్రకృతిని కాపడానికి కీలక కారణం, అది మనం ముందు తరానికి ఇచ్చివెళ్ళాలన్న   ఆశ , మరి ఈ ఆశ తీరాలంటే మనం ముందు తరాల కోరిక ఏంటి అన్నదాన్ని అర్ధం చేస్కుంటే ఈ భూమిని మనం కేవలం రియల్ స్టేస్తేట్లుగా మార్చం. ఒక సారి నా భార్య మాధవి రిసర్చ్ పని మీద ఒక మారు మూల ప్రాంతనాకి వెళ్ళింది అప్పుడు అధ్యయనంలో భాగంగా ఒక పిల్లాడిని అడిగింది  ‘నీకు ఇష్టమైనది ఏంటి?’ అప్పుడు  ఆ పిల్లాడిచ్చిన సమాధానం  ‘నాకు  మధ్యానం బువ్వ తిన్నాక  హాయిగా చింత చెట్టు కింద పడుకోవడం”! ఇది చాలా చిన్న కోరిక కావచ్చు కాని అది మాత్రం ఆ పిల్లాడికి ఇష్టమైన కోరిక , అది తీర్చాలంటే చింత చెట్లు వుండాలి కదా!  బ్రిటిష్ కాలం లో  బ్రవున్ దొర కడప కలెక్టర్ గా వున్నప్పుడు ప్రజల జీవనోపాధుల కోసం  చాలా చింత చెట్లని నాటించాడు, సామజిక అవసారాల్ని తీర్చనప్పుడు, ప్రక్రుతి సంరక్షణ జరగదు, నేడు కోపెన్ హేగన్ లో చేత్తలపెమ్పకం ఇదే స్పూర్తి తో జరుగుతోంది , కమ్మ్యునల్ ప్లాంటేషన్స్ అన్న పెరుతిఒ ఫలసాయం ఇచ్చే చెట్ల పెంపకం చేపట్టారు.  నేడు హరితహారం లో చింత  ఉసే కనిపించడం లేదు. చెట్ల నాటడం, పెంపకంలో ఆయా ప్రాంతాల్ని బట్టి , అక్కడి ప్రజలు , పిల్లల ఇష్టాల్ని, అవసరాల్ని పరిగానలోనికి తీసుకున్నప్పుడే అది ఫలితానిస్తుంది.
అలానే ప్రకృతి, పర్యావరణ కవిత్వం ,మన ప్రకృతిని సంరక్షించాలంటే పొయెటిక్ రిసర్చ్ అవసరం అది ఏకోసాఫి చూపుతో వుండాలి. ఏకోసాఫి  అంటే ఇకాలజి అండ్  పిలాసఫి. అది కొరియన్ సామెతలో తెలుసుకుందాం ...
“ ఈ భూమిని మనకి మన ముందు తరాలకు ఇచ్చే వెళ్ళారు వాళ్లకి మనం దీనిని వడ్డీ తో సహా  ఇచ్చి వెళ్ళాలి.”  చాలా ప్రాంతాల  సామెతల్లో భూమిని మన పూర్వికులు  ఇచ్చారు అని వుంటుంది, కాని కొరియన్ సామెత ప్రకారం అది మన ముందు తరాలది అందుకే దాన్ని వడ్డీతో ఇచ్చి వెళ్ళాలి. దీన్ని కవిత్వ పత్రాలతో ఇచ్చివేళదాం!






0 comments:

Post a Comment